ప్రభాస్, అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం, రోజా హాట్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కిడ్నాప్ చేసి నాగురోజులు తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కిడ్నాప్ చేసి నాగురోజులు తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టీ హింసిస్తున్నారన్నారు రోజా. ప్రజాస్వామ్యమా, నియంత పాలనలో ఉన్నామా అని నిలదీశారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేయండి, మూడు పార్టీలకు కాదు అన్నారు రోజా.
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ ఇద్దరు కలిసి కూర్చుని పాలిస్తే ఎలా ఉంటుందో , అలా సాగుతోందని ఆరోపించారు. పోలీసులు ఆడవాళ్ళను రక్షించడానీకి మీ పవర్ ఉపయోగించండని సూచించారు. టిడిపి వాళ్ళు సోషల్ మీడియా లో మీ కుటుంబం పై విష ప్రచారం చేసిన వాళ్ళపై పవన్ కళ్యాణ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు. ఆడవాళ్ళను హింసించడం కోసమే చంద్రబాబు పుట్టడా అనిపిస్తోందన్నారు రోజా. చంద్రబాబు వ్యక్తిత్వ హననం చేయడంలో ఘనుడు అంటూ రోజా ఆరోపించారు. పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్ ను బట్టలు విప్పినట్లు కార్టూన్ వేయించన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.
మహిళలు అనే గౌరవం లేదు, ప్రేమ లేదు రాష్ట్ర హోంమంత్రి కు గౌరవం లేదన్నారు. నిజంగా సిగ్గు చేటు సాక్షాత్తు హోం మంత్రి ఇంటి దగ్గరలోనే గంజాయి సాగు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సిఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం లో గంజాయి సాగు చేస్తున్నారు, ఈరోజు హోం మంత్రి ఇంటి దగ్గరలో గంజాయి సాగు చేస్తున్నారు, నిజంగా సిగ్గు పడాలి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. తాగండి , తాగి జీవితాలు నాశనం చేయండి అంటూ గంజాయి, మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చారన్నారు.
స్కూల్ పిల్లలు మద్యం తాగి స్కూల్స్ కు వెళ్ళే పరిస్థితి కు వచ్చారు అని ఈనాడు పత్రికలో రాసిందని బాధిత కుటుంబాన్ని కూడా బెదిరించే పరిస్థితి కు ఈరోజు స్టేట్ మెంట్ లు ఇచ్చే స్థితి కు పోలీసులు వచ్చారని ఆమె ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగడం లేదు, నేరస్థులకు పోలీసులు ప్రోత్సహిస్తున్నట్లు ఉందనన్నారు. గ్రూప్ లో అడ్మిన్ లుగా ఉన్నవాళ్ళపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులు, వేధింపులు పక్కన పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ తన సహచర నటుడు హీరో ప్రభాస్ , అల్లు అర్జున్ పై తప్పుడు పోస్ట్ లు పెట్టే వారిపై ముందు కేసులు పెట్టించండని సూచించారు. రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ ఐడి పెట్టీ కేసు పెట్టారు, వైజాగ్ లో టిడిపి కార్యకర్త అని గుర్తించారని రవీంద్ర రెడ్డి ను అరెస్టు చూపించలేదని ఆరోపించారు. మీకు సపోర్ట్ చేస్తున్న పోలీసులును వదిలిపెట్టేది లేదు, జగనన్న చెప్పిందే జరుగుతుందన్నారు.