కేటిఆర్ మాటల్లో అరెస్ట్ భయం..!

ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా ఈ అక్రమ కేసు అంశంలో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 12:02 PMLast Updated on: Jan 09, 2025 | 12:02 PM

Fear Of Arrest In Ktrs Words

ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా ఈ అక్రమ కేసు అంశంలో బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్.. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకోచ్చామన్నారు.

ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాదును గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ లో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉండిందని ఫార్ములా ఈ సందర్భంగా నిర్వహించిన ఈ- మొబిలిటీ వీక్ ద్వారా 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని పేర్కొన్నారు. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఈ అంశం అర్థం కాలేదన్నారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. మా ప్రభుత్వ విజన్ ను , నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని పోస్ట్ చేసారు.