Spl story: ఫ్యాంట్ లేపి చూపించండి.. గోరంట్లతో మహిళా డాక్టర్ ఓవరాక్షన్

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా సరే కొందరు అధికారులు మాత్రం వైసీపీ నేతలకు అండగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా మంత్రుల పేషీలలో, పోలీసు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అధికారులు, వైసీపీ నేతలకు భయపడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 10:13 AMLast Updated on: Apr 14, 2025 | 10:13 AM

Female Doctor Overreaction With Gorantla Madhav

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా సరే కొందరు అధికారులు మాత్రం వైసీపీ నేతలకు అండగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా మంత్రుల పేషీలలో, పోలీసు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అధికారులు, వైసీపీ నేతలకు భయపడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ శాఖలో ఇప్పుడు కాస్త ప్రక్షాళన జరుగుతున్నా.. ఇతర శాఖల్లో మాత్రం జరగడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పోలీసులు సహా కొందరి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీనితో మాధవ్ వ్యవహారంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోర్టుకు హాజరు పరిచిన సమయంలో సెల్ ఫోన్ మాట్లాడిన గోరంట్ల మాధవ్ కు పోలీసులు సహకరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ఎవరు ఇచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నారు. ఇక చేబ్రోలు కిరణ్ ను గోరంట్ల మాధవ్ వెంబడించారు. దీనితో కిరణ్ అడ్రస్ ను అసలు మాధవ్ కు ఎవరు చెప్పారు అనే దానిపై ఆరా తీసారు. కిరణ్ ఉన్న అడ్రస్సు కొంతమంది పోలీసు అధికారులు చెప్పారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో కూడా గోరంట్ల మాధవ్.. పోలీస్ ల పై ఓవరాక్షన్ చేసారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులపై వేటు పడింది. మొత్తం 12 మంది పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేసారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం వైద్యులు హడావుడి చేసారు. ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహిస్తున్న సమయంలో.. గోరంట్ల మాధవ్ ను ఫ్యాంట్ తీయాలని, మోకాలు చూపించాలని, అరికాళ్ళు చూపించాలని హడావుడి చేసారు ఓ డాక్టర్.

తనను పోలీసులు కొట్టలేదు అని చెప్పినా సరే.. చూపించాలి అంటూ హడావుడి చేయడం గమనార్హం. అక్కడ మాజీ మహిళా మంత్రి బంధువైన వైద్యురాలు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తనను పోలీసులు కొట్టలేదని ఆయనే స్వయంగా చెప్పినా.. పోలీసులు కొట్టారా అని న్యాయాధికారి మాదిరిగా హడావుడి చేసారు. ఈ వ్యవహారంలో పోలీసులను ఇరికించాలని ప్రయత్నం చేసారు సదరు డాక్టర్. మాధవ్‌కు వైద్య పరీక్షల నిర్వహణ, బందోబస్తుకు నియమితులైన 11 మంది అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వీరిలో అరండల్‌పేట సీఐ వీరాస్వామి, నగరంపాలెం ఎస్సై రామాంజనేయులు, పట్టాభిపురం ఎస్సై రాంబాబు, ఏఎస్సైలు ఏడుకొండలు (అరండల్‌పేట), ఆంధోని (అరండల్‌పేట), హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేష్‌ (నగరంపాలెం), కానిస్టేబుళ్లు తులసి నారాయణ, మోషే (పట్టాభిపురం), నగరంపాలెంకు చెందిన ప్రేమ్‌కుమార్‌, వెంకట స్వామి, మహేష్‌రావు తదితరులను సస్పెండ్ చేసారు.