వడ్డీతో సహా కట్టు వర్మ, సర్కార్ షాక్
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారంటూ నోటీసులు పంపింది.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారంటూ నోటీసులు పంపింది. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీకి ఫైబర్‌నెట్ నోటీసులు ఇచ్చింది. ఆయన వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాల్సిందే అని ఈ సందర్భంగా ఫైబర్ నెట్ తన లీగల్ నోటీసులో స్పష్టం చేసింది.