అగ్ని ప్రమాదం, పవన్ చిన్న కుమారుడికి సీరియస్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుతున్న స్కల్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో చిన్నారి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. దీంతో పాఠశాల యాజమాన్యం హుటాహుటిన మార్క్‌ను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స జరుగుతోంది. అయితే ఈ వార్త తెలిసే సమయానికే పవన్ మన్యంలోని అరకు పరిథి గిరిజన గ్రామాల పర్యటనకు వెళ్లారు.
దీంతో వెంటనే పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు పవన్‌కు సూచించారు. కానీ ఈ పర్యటన ముగించుకున్న తర్వాత తాను సింగపూర్ వెళతానని చెప్పారు పవన్. మార్క్ శంకర్ విద్యాభ్యాసం కారణంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆవిడ మార్క్ శంకర్‌తోనే ఉన్నారు. కాలిన గాయాలే కాకుండా మంటల కారణంగా వచ్చిన పొగను పీల్చడంతో మార్క్ శంకర్ శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురయ్యాడు. అరకు టూర్ ముగిసిన తర్వాత విశాఖ చేరుకునే పవన్ అక్కడి నుంచే నేరుగా సింగపూర్ వెళతారు. ఈ క్రమంలో విశాఖలో పవన్ టూర్ షెడ్యూల్‌ను అధికారులు రద్దు చేశారు.