బెజవాడ ఊపిరి పీల్చుకో, భారీగా తగ్గిన వరద
ప్రకాశం బ్యారేజ్ కు వరద భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12;30 గంటలకు 22 వేల క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతం 8,42,208 క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ కు వరద భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12;30 గంటలకు 22 వేల క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతం 8,42,208 క్యూసెక్కులుగా ఉంది. అయితే పై నుంచి వరద కాస్త ఆందోళన కలిగిస్తోంది. పులిచింతలలో ఉదయం 11 గంటలతో పోలిస్తే 2907 క్యూసెక్కులు తగ్గి ప్రస్తుతం 11 గంటలకు 4,82,316 క్యూసెక్కులుగా ఉంది.
కానీ శ్రీశైలం నుంచి, 4,22,546 క్యూసెక్కుల వరద వస్తోంది. నాగార్జున సాగర్ : నుంచి 4,79,986 క్యూసెక్కులు వస్తోంది. ఈ వరదకు పులిచింతల నీటిని కూడా కలిపితే 8 లక్షల క్యూసెక్కులు పై చిలుకు ఉంటుంది. ఈ వరద మరో రోజు ప్రకాశం బ్యారేజ్ కి కొనసాగే అవకాశం కనపడుతోంది. అటు బుడమేరు ఉదృతి కూడా క్రమంగా తగ్గుతోంది. మరో రెండు రోజుల్లో వరద పూర్తిగా తగ్గే అవకాశం కనపడుతోంది.