బలూచిస్తాన్‌లో ప్లాన్-Bపై ఫోకస్ పాక్ ఆక్రమణకు సిద్ధమైన చైనా
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?

ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్‌ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔను అనే చెబుతున్నాడు పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా. సీపెక్ ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అడ్డంకులు రావడంతో ప్లాన్-బీ అమలు చేయాలని జిన్‌పింగ్ సర్కార్ చూస్తున్నట్టు రజా సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్లాన్ వర్క్‌ఔట్ అయితే పాకిస్తాన్ చిన్నాభిన్నం కావడమే కాదు.. చైనా కబ్జా కోరల్లో చిక్కుకోవడం కూడా ఖాయం అని క్లియర్ కట్ కామెంట్ చేశాడు. కానీ, ఇప్పటివరకూ పాకిస్తాన్‌కు అన్నివిధాలుగా మద్దతుగా నిలిచిన బీజింగ్.. ప్లాన్-బీపై ఇప్పుడే ఎందుకు ఫోకస్ చేసింది? అసలు రజా బయటపెట్టిన చైనా ప్లాన్-బీ ఏంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
వాయిస్: ఏ దేశంలో అయినా చైనా పెట్టుబడులు పెడుతోందంటే దానికి కచ్చితంగా లెక్కలుంటాయి. ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టినచోట సహజవనరులు సమృద్ధిగా ఉంటాయి. కాదు కాదు.. అవి ఉంటే నే చైనా అడుగు పెడుతుంది. ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు. అందుకే, డ్రాగన్‌తో స్నేహం చేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించుకుంటాయి. కానీ, పాకిస్తాన్ పరిస్థితివేరు. పాలన చేతకాక, ఇండియాపై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బ తీశాయి. ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎవరో ఒకరి నుంచి సాయంపొందడం ఒక్కటే ఆప్షన్. అది చైనా అయినా మరోదేశం అయినా ఇస్లామాబాద్‌కు అవసరంలేదు. తన సహజవ నరులు దోచేసినా కాసిన్ని కాసులు పడేస్తే కామ్‌గా ఉంటుంది. ఈ లెక్కలతోనే జిన్‌పింగ్ సర్కార్ పాక్‌లో అడుగు పెట్టింది. దేశంలో ఎక్కడెక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట యాక్షన్ మొదలు పెట్టింది. దానికి సీపెక్ అని పేరు పెట్టి బలూచిస్తాన్‌లో వనరుల దోపిడీ మొదలు పెట్టింది.
వాయిస్: బలూచిస్తాన్.. సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలకు కేరాఫ్ అడ్రస్. కాపర్, బంగారం నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టుకు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్‌లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సమీపంలో ఉన్న గ్వాదర్‌లో సముద్ర జలాల్లో పోర్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్టు కీలకమైన చెక్ పాయింట్‌గా మారింది. చైనా ఇక్కడ మైనింగ్ ప్రాజెక్టులు, గ్వాదర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టుల అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్‌లో పాగా వేసి భారత్‌పై నిఘా పెట్టాలన్నదే. కానీ, వ్యూహాలు చేస్తే సరిపోదు.. వాటిని పర్ఫెక్టుగా అమలు చేయాలి కూడా. ఈ విషయంలోనే బీజింగ్ లెక్క తప్పింది.
వాయిస్: బలూచిస్తాన్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామాబాద్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో భాగమయిన చైనీయులకు దారుణంగా చంపేస్తున్నారు. ఈ తిరుగుబాటు వ్యవహారాలను అడ్డుకోవాలని ఇస్లామాబాద్‌కు చైనా పలుమార్లు చెప్పిచూసింది. మరికొన్ని సందర్భాలలో హెచ్చరించింది కూడా. కానీ, ఈ విషయంలో పాక్ పాలకులు విఫలమయ్యారు. అలాని సీపెక్ ప్రాజెక్టును మధ్యలో వదిలేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కోసం బీజింగ్ అక్షరాలా 62 బిలియన్ డాలర్లు కుమ్మరించింది. మధ్యలో ఆపేస్తే అందులో ఒక్క డాలర్ కూడా తిరిగి రాదు. దీంతో చైనా వ్యూహం మార్చేసింది. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులతో డీల్‌సెట్ చేసుకోవాలని డిసైడ్ అయింది. కుదిరితే డబ్బుతో కొనడం, లేదంటే బలూచీలు అడుగుతున్న ప్రత్యేక దేశం అంశానికి మద్దతివ్వడం.. రెండిట్లో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. వివరంగా చెప్పాలంటే బలూచిస్తాన్‌లో చైనా ప్లాన్-బీ ఇదే. ఈ సంచలన నిజాన్ని పాకిస్తాన్ మాజీ సైనికాధికారి ఆదిల్ రజా బయటపెట్టారు. కానీ, కథ ఇక్కడితో అయిపోలేదు.. అసలు స్టోరీ చాలానే ఉంది.
కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ సొసైటీలో సైనిక స్థావరం నిర్మించాలనేది చైనా మరో ప్లాన్. ఈ స్థావరాన్ని చైనా గూఢచార సంస్థ, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పఠిష్టంగా నిర్మిస్తారట. చైనా గూఢచార సంస్థ.. పాక్ సైన్యం నుండి రిటైర్డ్ అధికారులను ప్రైవేటు భద్రతా దళంగా నియమించాలని యోచిస్తోందని రజా చెబుతున్నాడు. బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా మారిస్తే అక్కడ చైనా ప్రాజెక్టులు సాఫీగా సాగుతాయి. కానీ, కరాచీలో స్థావరం నిర్మాణం ఎందుకు? ఎందుకంటే పాక్ మొత్తం తన ఆధీనంలో ఉండాలని బీజింగ్ భావిస్తోంది కాబట్టి. వివరంగా చెప్పాలంటే పేరుకు పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఉన్నా.. అనధికారికంగా చైనాదే పెత్తనం అవుతుందన్నమాట. కాదని అడ్డం తిరిగే తన స్టైల్‌లో పాకిస్తాన్‌లోనూ కమ్యునిస్టు జెండా ఎగరేస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్‌లో తిరుగుబాటు దారుల దాడులు ఆగిపోయాయి. అంటే ఆల్రెడీ వారు చైనా పంచన చేరినట్టు అనుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్.. చైనా కబ్జా కోరల్లో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. అందుకే, చైనా లాంటి కన్నింగ్ కంట్రీతో పెట్టుకునేముందు ఒకటికి లక్ష సార్లు ఆలోచించుకోవాలనదే.