బ్రేకింగ్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన షకీల్ ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి నిన్న చనిపోయారు. అచన్‌పల్లిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మాత్రం అనుమతినిచ్చారు.
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2022 మార్చ్‌లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ కేసులో షకీల్ కొడుకు రాహిల్ ప్రధాన నిందితుడు. ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించారంటూ షకీల్ మీద కూడా కేసు నమోదయ్యింది. ఇదే కేసులో ఇద్దరు సీఐలతో పాటు మొత్తం 16 మందిని దోషులగా తేల్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొడుకుతోపాటు షకీల్ దుబాయ్‌కి పారిపోయాడు. దీంతో పోలీసులు ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అప్పటి నుంచీ దుబాయ్‌లోనే ఉన్న షకీల్ ఇప్పుడు ఇండియాకు వచ్చిన వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.