JD Lakshminarayana: ఏపీలో జేడీ కొత్త పార్టీ ! పోటీ ఎక్కడి నుంచంటే.
జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. ఓటమి చవిచూశారు. ఐతే ఆ తర్వాత గ్లాస్ పార్టీకి దూరం అయిన లక్ష్మీనారాయణ.. రాజకీయాలను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతీ పరిణామం మీద స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న బర్రెలక్కను కూడా కలిసి వచ్చారు.
JD Lakshminarayana: లక్ష్మీనారాయణ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లో టక్కున గుర్తుపట్టేస్తారు. పదవిని పేరుగా మార్చుకున్న అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఆయన పనితనానికి, నిజాయితీకి ఇదే నిదర్శనం అంటూ.. చాలామంది ప్రశంసలు గుప్పిస్తుంటారు. సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల వైపు అడుగులు వేశారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. ఓటమి చవిచూశారు. ఐతే ఆ తర్వాత గ్లాస్ పార్టీకి దూరం అయిన లక్ష్మీనారాయణ.. రాజకీయాలను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రతీ పరిణామం మీద స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న బర్రెలక్కను కూడా కలిసి వచ్చారు.
NARA LOKESH: జగన్ ఒక భస్మాసురుడు.. అరెస్టులకు భయపడం: నారా లోకేష్
ఐతే ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో కొత్త అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. సొంతగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఐతే దీనికి అవసరం అయితేనే అనే ట్యాగ్ పెట్టారు అనుకోండి.. అది వేరే విషయం! ప్రస్తుతం జేడీ ఏ పార్టీలో లేరు. టీడీపీ, వైసీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నా.. ఆయన దూరంగా ఉంటున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. ఐతే ఇప్పుడు మాత్రం కొత్త బాంబ్ పేల్చారు అవసరమైతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ క్లియర్‌కట్‌గా చెప్పారు. రాజకీయాల్లో తన అడుగుల గురించి.. డిసెంబరు రెండో వారంలో క్లారిటీ ఇస్తానని జేడీ అంటున్నారు. ఐతే ఈ మధ్య వైసీపీ సర్కార్‌ను పొగుడుతూ.. ఆయన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుండటం.. వైసీపీ కూడా విశాఖ సీటుపై ఆచితూచి అడుగులు వేస్తుండడంతో ఆయన వస్తారనే అనుకున్నారు. ఐతే ఇప్పుడు ఆయన మాత్రం కొత్త పార్టీ అని బాంబ్ పేల్చారు. అది కూడా.. అవసరం అయితేనే అని అనడంతో.. ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది.. ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. విశాఖ నుంచే ఆయన పోటీ చేయడం ఖాయం.. ఐతే అది కొత్త పార్టీ నుంచా.. కొత్తగా చేరబోయే పార్టీ నుంచా.. ఇండిపెండెంట్‌గానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.