జగన్ జబర్దస్త్ ప్లాన్.. అసెంబ్లీ వస్తోంది ఇందుకా ?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. కేవలం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. అటు తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పూర్తిగా దూరంగా ఉంది. సాధారణ ఎమ్మెల్యేగా సభలో చాన్స్ ఇస్తే.. గళం వినిపించలేమంటూ జగన్ చెప్తూ వచ్చారు. ఐతే 6 నెలలు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అంటూ.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆ వేటు తప్పించుకునేందుకే జగన్..అసెంబ్లీకి హాజరవుతున్నారా అనే చర్చ మొదలైంది.
జగన్ భయపడ్డారని.. అందుకే సభకు వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఐతే అసలు స్ట్రాటజీ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయం వెనక చాలా కారణాలు అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయ్. తొలిరోజు మండలి, శాసనసభను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. ఈ సమావేశాలకు జగన్ అండ్ కో హాజరు కానున్నారు. ఆ తర్వాత రోజుల సంగతి ఏంటన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఫస్ట్ డే మాత్రమే వెళ్తే.. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. గవర్నర్ మాట్లాడుతుంటే.. ఆలా చూస్తూ, వింటూ కూర్చోవడమే! దీనికోసమే జగన్ వస్తున్నారా అంటే.. చాన్సే లేదంటూ.. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు జనాలు.
మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు వచ్చిన జగన్.. ఎమ్మెల్యేలతో కలిసి రచ్చ చేశారు. వైసీపీ నేతలపై దాడులను ఖండిస్తూ.. నల్ల బ్యాడ్జీలు ధరించి.. నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అసెంబ్లీ లోపల, బయట అదే చేయబోతున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత.. జగన్ కోపంతో ఊగిపోయారు. అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ.. సీఐ పేరు ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు అరెస్ట్‌ల వ్యవహారంపై అసెంబ్లీలో జగన్ నిరసనలకు దిగుతారా.. అధికారపక్షాన్ని కార్నర్ చేస్తారా… అందుకే మనసు మార్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది.. తొలిరోజు మాత్రమే వచ్చి.. రచ్చ చేసి వెళ్లిపోవడమే ఇప్పుడు జగన్ స్ట్రాటజీనా అనే చర్చ జరుగుతోంది.