Chevella Election campaign : నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ఎన్నికలకు శంఖరావం పురించనున్న మాజీ సీఎం కేసీఆర్..
నేడు బీఆర్ఎస్ (BRS) ఛీఫ్ కేసీఆర్ (KCR) లోక్‌సభ ఎన్నికల శంఖరావానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
నేడు బీఆర్ఎస్ (BRS) ఛీఫ్ కేసీఆర్ (KCR) లోక్‌సభ ఎన్నికల శంఖరావానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేవెళ్ల ఎంపీ (Chevella MP) స్థానాన్ని బీఆర్ఎస్ రెండు సార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగా నేడు చేవెళ్ల లోక్‌సభ (Parliament Elections) అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) కు మద్ధతుగా నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొనున్నారు. చేవెళ్లలోని ఫరా కాజేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
నేటి సాయంత్రం ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్ కేసీఆర్, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేసేందుకు చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు గులాబీ కార్యకర్తలు అలాగే లీడర్లు. ఇక ఇవాళ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సభకు కేసీఆర్ రోడ్డు మార్గంలోనే సభకు రానున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy), చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
SSM