కేసు పెట్టినవాడికే 10 లక్షలు ఇచ్చి విత్ డ్రా.. పక్కా ఆధారాలతో వంశీని ఫిక్స్ చేసిన పోలీసులు..

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు...తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 03:10 PMLast Updated on: Feb 14, 2025 | 3:10 PM

Former Gannavaram Mla Vallabhaneni Vamsimohan Was Arrested

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు…తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో 71వ ముద్దాయిగా ఉన్న వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని…హైదరాబాద్‌ రాయదుర్గంలోని నివాసం నుంచి ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీటీపీ కార్యాలయంపై దాడి జరిగింది. BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది.

పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే హఠాత్తుగా సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి…బెదిరించడంతో ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేసినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో…అసలు కథను చెప్పాడు. వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనకపోయినా, ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ అనుచరులు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, వల్లభనేని వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక పోస్టుల్లో ఉండడంతో ఈ కేసులో దర్యాప్తు ముందుకు తాజాగా సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులు గతంలోనే బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో కొందర్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పట్లో టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీసులు…వల్లభనేని వంశీమోహన్ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగు సంవత్సరాలుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్​లో ఉన్నారా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే దానిపై లోతుగా పరిశీలన చేశారు. ఆయన కాల్ డేటా , సహాయకుల కదలికలపై నిఘా పెట్టారు. ఇంతలోనే వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేయడంతో…కేసును వాపసు తీసుకోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హైదరాబాద్ లో పోలీసులు నిఘా పెట్టి…అరెస్టు చేశారు.