Boda Janardhan: కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి..
బీఆర్ఎస్, బీజేపీతో కంపేర్ చేస్తే.. కాంగ్రెస్‌లోకి భారీ వలసలు కనిపిస్తున్నాయ్. దీంతో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నాయ్ కాంగ్రెస్ (congress) శ్రేణులు. ఇలాంటి పరిణామాల మధ్య.. హస్తం పార్టీకి భారీ ఝలక్ తగిలింది.
Boda Janardhan: ఎన్నికల వేళ తెలంగాణలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయ్. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్ జపాంగ్‌లు కనిపిస్తున్నాయ్. బీఆర్ఎస్, బీజేపీతో కంపేర్ చేస్తే.. కాంగ్రెస్‌లోకి భారీ వలసలు కనిపిస్తున్నాయ్. దీంతో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నాయ్ కాంగ్రెస్ (congress) శ్రేణులు. ఇలాంటి పరిణామాల మధ్య.. హస్తం పార్టీకి భారీ ఝలక్ తగిలింది. తెలంగాణలో మరో మూడు వారాలలో ఎన్నికలలు జరగనుండగా.. ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల ప్రచారాల హడావుడి భారీగా ఉంది.
TELANGANA ASSEMBLY ELECTIONS: నామినేషన్లకు మూడు రోజులే.. టిక్కెట్లు ఇవ్వండి బాబో..!
ఇదే సమయంలో సీట్లు రాలేదన్న కారణాలతో పార్టీలకు షాక్ ఇస్తూ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మాజీ మంత్రి బోడ జనార్దన్ (Boda Janardhan) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అధిష్టానానికి భారీ షాక్ ఇచ్చారు. బోడ జనార్దన్ మొదటి నుంచి చెన్నూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఐతే ఇతనికి ఆ టికెట్ దక్కకపోవడంతో ఇక ఈ పార్టీలో ఉండి లాభం లేదనుకుని రాజీనామా లేఖను కాంగ్రెస్‌కు పంపించారు. అయితే ఇతనికి బదులుగా కాంగ్రెస్ ఆ టికెట్‌ను కనీసం సభ్యత్వం కూడా లేని వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)కి ఇచ్చారన్న కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. టికెట్‌లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ బోడ జనార్దన్ కామెంట్ చేశారు.
Varun Tej: ఏదో మనసులో పెట్టుకునే రిసెప్షన్‌కి రాలేదా..?
కేసీఆర్ సమక్షములో బోడ జనార్దన్ బీఆర్ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక అటు ఈ మధ్యే బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్.. కొడుకుతో పాటు కాంగ్రెస్‌లో చేరారు. వివేక్‌కు కానీ, ఆయన కుమారుడికి కానీ చెన్నూరు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్‌లో వారి పేర్లు కనిపించే చాన్స్ ఉంది. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు అనుకొని.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు బోడ జనార్దన్