తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆరున్నర గంటలుగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు తిరుగుతున్నాయి. నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి పంపడంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. నిధుల బదలాయింపులో FEMA నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి ఆరవింద్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఈడీ విచారణ జరుగుతోంది. [embed]https://www.youtube.com/watch?v=2NRrGOGe3-I[/embed]