సాయి రెడ్డి నువ్వొక రోగ్, కొవ్వు ఎక్కువ: సోమిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎం చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి క్రూరం గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎం చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి క్రూరం గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయ్ సాయి రెడ్డికి కొవ్వెక్కువ అని, రోగ్ లాగా మాట్లాడుతున్నాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నీ బ్రతుకు అంతా తెలుసు అంటూ సంచలన కామెంట్స్ చేసారు. జగన్ తో పాటు అరెస్టు అయ్యాక విజయసాయి మా జిల్లా వాడు అని తెలిసిందన్నారు.
సిఎం చంద్రబాబు పై విజయ్ సాయి రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పింక్ డైమండ్ పై అప్పట్లో చంద్రబాబు పై ఆరోపణలు చేసావని… పింక్ డైమండ్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూపించని సవాల్ చేసారు. డీజీపీ చూస్తూ ఊరుకుంటే ఎలా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా లో మాట్లాడిన వారిని అరెస్టు చేశారు.. పోలీసులు విజయ్ సాయి రెడ్డికి ఎందుకు ఎగ్జిమ్షన్ ఇస్తున్నారని నిలదీశారు.