విజయసాయితో రాజీకి మాజీ ఎంపీ రంగంలోకి…!
రాజ్యసభకు, రాజకీయాలకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది వైసిపి వర్గాల్లో కనపడని ఓ భయం. ఆయన అప్రూవర్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వైసిపి నేతలకు ఒక క్లారిటీ ఉంది.

రాజ్యసభకు, రాజకీయాలకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది వైసిపి వర్గాల్లో కనపడని ఓ భయం. ఆయన అప్రూవర్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వైసిపి నేతలకు ఒక క్లారిటీ ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై విజయసాయిరెడ్డి ప్రభావం చాలా ఎక్కువ. 2004 తర్వాత వ్యాపార రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరించిన వైయస్ జగన్… విజయసాయిరెడ్డిని అత్యంత కీలక స్థానంలో కూర్చోబెట్టారు. జగన్ ఆస్తులు వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు సహా పలు కీలక అంశాల్లో విజయసాయిరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది.
దీనితో విజయసాయిరెడ్డి ఎక్కడ నోరు విప్పిన సరే జగన్ ఇబ్బంది పడక తప్పదు. చిన్న కేసుల నుంచి పెద్ద కేసుల వరకు విజయసాయిరెడ్డి కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ జగన్ ను కాపాడే ప్రయత్నం చేశారు. ఢిల్లీ స్థాయిలో గత 7, 8 ఏళ్ల నుంచి జగన్ కోసం విజయసాయిరెడ్డి… తిరగని ఆఫీసు లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా దగ్గరయ్యారు విజయసాయిరెడ్డి. అయితే అనూహ్యంగా వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.
దీనితో జగన్ కేసుల్లో ఏ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి… ఏం మాట్లాడతారనే దానిపై వైసీపీ నేతలలో భయం మొదలైంది. ఇటీవల ఆయన పార్టీలో కోటరి ప్రభావం ఎక్కువగా ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత వైసిపి నేతల్లో భయం మొదలైంది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం… విజయసాయిరెడ్డి తో రాజీకి రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మాజీ రాజ్యసభ ఎంపీ… టీ సుబ్బిరామిరెడ్డి సయోధ్య కుదిరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత కొన్నాళ్లుగా సుబ్బిరామిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే విజయ్ సాయి రెడ్డికి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో సుబ్బిరామి రెడ్డి ద్వారా అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి… ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావు ద్వారా విజయ సాయి రెడ్డిని మళ్లీ దగ్గర చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి దూరమైనా.. ఆయన ఏదైనా బయటపెట్టిన సరే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి అనే అంచనాకు వైసీపీ అధిష్టానం వచ్చేసింది.
ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుతో పాటుగా కొన్ని కీలక కేసుల్లో… జగన్ ను అలాగే కొంతమందిని విజయసాయిరెడ్డి కాపాడుతున్నారనే అభిప్రాయాలు చాలామంది నుంచి వినపడుతున్నాయి. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ఏ అడుగు వేసిన సరే… కచ్చితంగా వైసీపీ నిండా మునిగిపోవడం కాయం. దానికి తోడు వైఎస్ షర్మిల కూడా విజయసాయిరెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల లోటస్ పాండ్ లో వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. దీనితో వైసీపీ అధిష్టానం ఇప్పుడు విజయసాయిరెడ్డి ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.