ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్, ప్రాసెస్ ఇదే

సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కావాల్సిన అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్హత కలిగిన వినియోగదారుడు నేటి నుంచి 10 గంటలకు నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2024 | 11:36 AMLast Updated on: Oct 29, 2024 | 11:36 AM

Free Gas Cylinder In Ap The Process Is The Same

సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కావాల్సిన అర్హతలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్హత కలిగిన వినియోగదారుడు నేటి నుంచి 10 గంటలకు నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆథార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేయనున్నారు. మొదట ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో బుకింగ్ చేసుకునే వెంటనే వినియోగానికి తన బుకింగ్ కన్ఫామ్ చేస్తూ అభినందన తెలియజేస్తూ ఎస్ఎంఎస్ వస్తుంది.

గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటలలో పట్టణాల ప్రాంతాల్లో, 48 గంటలు గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ చేస్తారు. 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ చేస్తారు. అనంతరం వినియోగదారుడి ఎకౌంటుకు నగదు జమ అయినట్లు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న 1.55కోట్ల గ్యాస్ కనెక్షన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేస్తారు.