రష్యాకు ఫ్రీ విసా

భారతీయులు రష్యా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక వీసా అవసరం లేకుండానే ఇండియన్స్‌ రష్యాలో పర్యటించవచ్చు. 2025లో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 08:01 PMLast Updated on: Dec 16, 2024 | 8:01 PM

Free Visa To Russia

భారతీయులు రష్యా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక వీసా అవసరం లేకుండానే ఇండియన్స్‌ రష్యాలో పర్యటించవచ్చు. 2025లో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది. బృందాలుగా వచ్చే భారతీయుల విషయంలో వీసా నిబంధనలను సడలించాలని జూన్‌ నెలలో భారత్‌-రష్యాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రష్యాలో పర్యటించాలంటే ఏ పని మీద వచ్చారన్నదాన్ని గమనించి వీసా మంజూరు చేస్తారు. టూరిస్టు, బిజినెస్‌, ఉద్యోగం, స్టూడెంట్‌.. ఇలా పలు రకాల వీసాలు ఉంటాయి.

ప్రస్తుతం వీటి మంజూరుకు చాలా సమయం పడుతోంది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి భారతీయ పర్యాటకులకు ఏకీకృత ఈ-వీసాని అమలు చేస్తున్నారు. వచ్చే పని ఏదన్నదానితో సంబంధం లేకుండా యూఈవీ ఉంటే అన్నింటికీ చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు సరళీకరించారు. ఈ సౌకర్యాన్ని 55 దేశాలకు వర్తింపజేసింది. ఆ జాబితాలో ప్రస్తుతం భారత్‌ కూడా చేరింది. చైనా, ఇరాన్‌ దేశాల పౌరులకు వీసా-ఫ్రీ విధానాన్ని అమలు చేస్తుండగా ఇకపై భారత్‌కు కూడా అదే సౌకర్యం కలగనుంది. యూఈవీల కోసం రష్యా రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలు రిజిస్ట్రేషన్‌ సిస్టంతో ఉన్న సమాచారంతో సరిపోయినప్పుడే మాత్రమే వీసాలు మంజూరు చేస్తుంది. దీన్ని మంజూరు చేసేందుకు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. యూఈవీ ఉంటే రష్యాలో ఏ పనిమీదయినా పర్యటించడానికి వీలు కలుగుతుంది.