Top story చెప్పు నుంచి చెంప దాకా అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు
ఇంక్ నుంచి కారంపోడి దాకా...చెప్పు నుంచి చెంప పగలగొట్టడం వరకు..అటాక్ జరిగిందా ? ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదా ? గతంలోనూ ఎన్నో దాడులు జరిగాయా ? తాజాగా లిక్విడ్ దాడి ఎందుకు జరిగింది ? ఇదే ఇపుడు హాట్ టాపిక్ గామారింది.
ఇంక్ నుంచి కారంపోడి దాకా…చెప్పు నుంచి చెంప పగలగొట్టడం వరకు..అటాక్ జరిగిందా ? ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదా ? గతంలోనూ ఎన్నో దాడులు జరిగాయా ? తాజాగా లిక్విడ్ దాడి ఎందుకు జరిగింది ? ఇదే ఇపుడు హాట్ టాపిక్ గామారింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై అటాక్ జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్ చల్లాడు. ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కొంత ద్రావణం కేజ్రీవాల్ దుస్తులపై పడింది. అక్కడున్న ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాడులకు భయపడేది లేదని…ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మీకు వీలైతే గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు.దేశ రాజధానిలో ఒక మాజీ ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది. ఎందుకంటే ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్రహోం శాఖ పరిధిలో ఉంటాయి.
అరవింద్ కేజ్రీవాల్ పై దాడులు కొత్తేమీ కాదు…గతంలోనూ ఎన్నోసార్లు అనేక రకాలుగా దాడులు జరిగాయి. 2013లో కేజ్రీవాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో…నచికేత వాఘ్రేకర్ అనే వ్యక్తి ఆయనపై ఇంక్ విసిరాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అన్నా హజారే మద్దతుదారునిగా చెప్పుకున్నాడు. అదే ఏడాది అన్నా హజారే మద్దతుదారునిగా చెప్పుకున్న ఓ దుండగుడు….కేజ్రీవాల్ ఓపెన్ జీపుపైకి ఎక్కి…అతని మెడపై కొట్టాడు. ఊహించని పరిణామంతో కేజ్రీవాల్ షాకయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోనూ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు…గుడ్లు, సిరా విసిరారు. 2014 ప్రిల్ 8న ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఓ ఆటోరిక్షా డ్రైవర్ అరవింద్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టాడు. తనను చెప్పుతో కొట్టిన ఆటో-రిక్షా డ్రైవర్ లాలీ ప్రసాద్…అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ మాజీ సీఎంపై దాడి చేయడం…తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని పశ్చాతాపం వ్యక్తం చేశాడు. దీనికి నాలుగు రోజుల ముందు ఢిల్లీలోని దక్షిణపురిలో జరిగిన రోడ్‌షోలో…కేజ్రీవాల్‌ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించాడు.
2016 జనవరిలో ఆమ్ ఆద్మీ ఆర్మీ సభ్యుడు అర్జున్ అరోరా…అరవింద్ కేజ్రీవాల్‌పై సిరా విసిరారు. ఆ తర్వాత ఏప్రిల్ లో కేజ్రీవాల్ ఢిల్లీలో సరి-బేసి పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సమయంలో….ఒక వ్యక్తి షూ విసిరాడు. అక్టోబరు నెలలో రాజస్థాన్ లోని బికనూర్ లో…కేజ్రీవాల్ ముఖంపై ఏబీవీపీ కార్యకర్త ఇంకు విసిరాడు. 2018 నవంబర్ 20న…అనిల్ శర్మ అనే వ్యక్తి…అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక లేఖను అందజేశారు. ఆప్ అధినేత పాదాలను తాకడానికి వంగి…ముఖంపై కారం పొడిని పూసాడు.