Top story: వేల కోట్ల FSI స్కాం…KTR చేసిన పాపం, హైదరాబాద్ కి శాపం…!

హైదరాబాద్ సిటీ లో ఎటు వైపు అయినా వెళ్లండి...ట్రాఫిక్ జాం తో పిచ్చెక్కి పోతుంది. హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామన్నారు. నిత్య నరకం చూపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 06:30 PMLast Updated on: Mar 26, 2025 | 6:30 PM

Fsi Scam Of Thousands Of Crores Ktrs Sin A Curse On Hyderabad

హైదరాబాద్ సిటీ లో ఎటు వైపు అయినా వెళ్లండి…ట్రాఫిక్ జాం తో పిచ్చెక్కి పోతుంది. హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామన్నారు. నిత్య నరకం చూపిస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాదులో డ్రైనేజ్ వ్యవస్థ దారుణాతి దారుణంగా ఉంది. అపార్ట్మెంట్స్ లో జనం నీటికొరత తో అల్లాడిపోతున్నారు. సిటీ అంతా సిపేజ్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్. ఉదయం 7 గంటల నుంచి అన్ని ఏరియాలో ట్రాఫిక్ జాం. రోడ్లు సరిపోవడం లేదు. ఈ దుస్థితి వచ్చిందో తెలుసా….50…60…ఫ్లోర్s ఆకాశ హార్మయాలు , బహుళ అంతస్తుల భవనాలు, మల్టీస్టోర్ బిల్డింగ్స్ నిర్మించడం వల్లే . 40…60 ఫ్లోర్లలో జనమంతా ఒకే చోట పోగు పడిపోవడమే కారణం. ఎకరం భూమిలో 50 ఫ్లోర్s టవర్లు కట్టి పడేసి సిటీ మొత్తం సమస్యల మయం చేసేశారు. దీనికి కారణం FSI అదే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల FSI స్కాం పై ఇప్పటి వరకు యెవ్వరు దృష్టి పెట్టలేదు.

ఈ వేల కోట్ల రూపాయల FSI స్కాం వెనుక అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులు , బడా రియల్టర్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వందల కోట్ల రూపాయల లంచాలు, కన్స్ట్రక్షన్ లో 30% వాటాలు తీసుకొని 40 నుంచి 50 ఫ్లోర్లకు పర్మిషన్లు ఇచ్చి నగరాన్ని నరకంగా మార్చేసింది అప్పటి కెసిఆర్ ప్రభుత్వం. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం ఐదు.. ఆరు బడా రియల్ ఎస్టేట్ సంస్థలే ప్రభుత్వాన్ని నడిపించాయి. వాళ్ళు ఏం చెప్తే అదే సాగింది. కేటీఆర్ హయాంలో అన్లిమిటెడ్ ఎఫ్ ఎస్ ఐ జీవో 50 తీసుకొచ్చి…. ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టవచ్చు అని అనుమతులు ఇచ్చారు. అసలు భూమి పరిస్థితి ఏంటి,? జల వనరులు ఉన్నాయా? లేవా,? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది?, ఆ వాహనాలన్నీ రోడ్లమీదకి ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి, ?చుట్టుపక్కల ఉన్న రోడ్డు వైశాల్యం ఎంత,? డ్రైనేజీ సిస్టం ఎలా ఉంది?, సిపేజీ … సీనరేజీ పరిస్థితి ఏంటి? ఇవేమీ తనిఖీలు చేయకుండానే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. అందుకు అధికారులకు వందల కోట్ల రూపాయల లంచాలు పుట్టాయి. అప్పటి మంత్రులకు రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్ లు, కన్స్ట్రక్షన్ ఉండడం వలన వెనక ముందు చూడకుండా అనుమతులు ఇచ్చేశారు.

వాటన్నిటి ఫలితమే హైదరాబాద్ నరకంగా మారింది. ఇష్టానుసారంగా అనుమతి లిచ్చి, అవసరానికి మించి నిర్మాణాలు చేపట్టి… ఇష్టానుసారంగా అపార్ట్మెంట్లు కట్టిపడేసి… రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చింది అప్పటి కెసిఆర్ ప్రభుత్వం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రైడ్ చేస్తే వందల కోట్ల ఆస్తులు బయట పడ్డాయి. శివ బాలకృష్ణ ఎఫ్ ఎస్ ఐ నిబంధనలను అన్నిటిని తుంగలో తొక్కి 50 …60 ఫ్లోర్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా కోట్లు సంపాదించాడు. ఒక్క శివ బాలకృష్ణ అక్రమార్జన వందల కోట్ల రూపాయల్లో ఉంటే… అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్, కెసిఆర్ క్యాబినెట్లో మంత్రులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఎన్ని వేల కోట్లు ఈ ఎఫ్ ఎస్ ఐ స్కామ్ లో వెనకేశారో అర్థం చేసుకోవచ్చు.10 ఫ్లోర్స్ కట్టాల్సిన చోట…..50 ఫ్లోర్లు కడితే… వేల మంది జనం ఒకే చోట పోగుబడిపోతే…. వాళ్లకు సౌకర్యాలు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవేమీ ఆలోచించకుండా కేవలం డబ్బులు దండుకోడానికే అప్పట్లో ఎఫ్ ఎస్ ఐ నిబంధనలను సడలించేసి హైదరాబాద్ మొత్తం టవర్లతో వేశారు కేటీఆర్ అండ్ టీం.

అసలు ఏమిటి ఎఫ్ ఎస్ ఐ? ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఎకరానికి ఎన్ని అంతస్తులు కట్టాలి? ఎంత నిర్మాణం చేపట్టాలి అన్నదే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ ఎస్ ఐ. దీన్ని అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, మంచినీటి వసతి, శానిటేషన్ సౌకర్యాలు, రోడ్ల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని ఫ్లోర్లు కట్టాలో నిర్ణయిస్తారు.2006లో అప్పటి వైఎస్సార్ సర్కార్ జీవో నెంబర్ 86 తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టు పోవడానికి అనుమతిస్తూ అపరిమిత ఎఫ్ ఎస్ ఐ తెచ్చారు. ఆ తర్వాత 2012లో ఆ జీవో కి కొన్ని సవరణలు చేశారు. మీటర్ ఎత్తు నుంచి 55 మీటర్ల హైట్ వరకు 16 మీటర్ల సెట్ బ్యాక్ వదలాలి అనే నిబంధన ఉంది. అయితే 55 మీటర్లు దాటిన తర్వాత పెరిగే ప్రతి ఐదు మీటర్లకు అదనంగా అర మీటర్ స్టేట్ బ్యాంక్ వదలాలి అనే నిబంధనని పొందుపరిచారు, అంటే 55 మీటర్ల కంటే ఎత్తులో అపార్ట్మెంట్ ని కట్టాల్సి వస్తే కింద అర మీటర్ చొప్పున సెట్ బ్యాక్ వదలాల్సి ఉంటుంది. అప్పట్లో బిల్డర్లకి దీనివల్ల పెద్ద నష్టపోయేదేమీ లేదు. కారణం రెండు శాతం మినహా ఎక్కువమంది బిల్డర్లు ఇరవై అంతస్తులు లోపే అపార్ట్మెంట్లు నిర్మించేవాళ్లు.

2019 నాటికి బి ఆర్ఎస్ ప్రభుత్వం…. కేటీఆర్ సారధ్యంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం చేయాల్సిన మున్సిపల్ చట్టాలను రియల్ ఎస్టేట్ బిల్డర్లే రూపొందించే స్థాయికి దిగజారి పోయింది అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం.55 మీటర్ల ఎత్తుకు మించి నిర్మించే టవర్లకు అదనంగా వదలాల్సిన 0.5 మీటర్స్ సెట్ బ్యాక్ నిబంధన తొలగించారు కేటీఆర్. ఈ నిబంధన తొలగింపు వెనుక అప్పట్లో రియల్ ఎస్టేట్ కంపెనీల లాబీయింగ్ బలంగా పనిచేసింది. సెట్ బ్యాక్ నిబంధనలను తొలగిస్తూ…. అన్ లిమిటెడ్ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు అంటూ కేటీఆర్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 50, రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వరంగా మారింది ,వేల కోట్లు కురిపించింది. ఈ అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కి తోడు సెట్ బ్యాక్ రూలు లేకపోవడంతో ఎకరాకి లక్షన్నర చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ కి బదులు 4.5 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు చేశారు. కొందరు ఎకరానికి ఆరు లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు.

40 అంతస్తులు….50 అంతస్తులు ఇష్టం వచ్చినట్టు నిర్మిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం ఉందా లేదా అనేది చూడడం లేదు. శానిటేషన్ ఉందా లేదా ? అని పట్టించుకోవడం లేదు. అసలు గ్రౌండ్ వాటర్ దొరుకుతుందా లేదా….? ఎకరం భూమిలో ఆరు లక్షల ఎస్ ఎఫ్ టి నిర్మాణాలు చేస్తే….. అందులో నివసించే వాళ్ళ మురుగు అంత ఎటు వెళ్తుంది? వాళ్ల కార్లు ఒకేసారి రోడ్డు మీదకు వస్తే పరిస్థితి ఏంటి? ఇవేమీ పట్టించుకునే నాధుడు లేడు? మై హోమ్, రాజ పుష్ప, అపర్ణ, వంశీరాం బిల్డర్స్, వర్టిక్స్, అరబిందో, వాసవి , అలేఖ్య ఇలా ఒకరేంటి బడా రియల్ ఎస్టేట్ బిల్డర్లు అందరూ కూడబలుక్కుని కేటీఆర్ సహకారంతో హైదరాబాదును ముంచేశారు. అడ్డగోలుగా నిర్మాణాలు చేసి…. ఈరోజు సిటీ ట్రాఫిక్ నరకం తో అల్లాడిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారు. హైదరాబాద్ కి సముద్రం లేదు.360 డిగ్రీస్ లో కావలసినంత భూమి ఉంది. హారిజంటల్ గా 120 కిలోమీటర్ల వరకు నగరం ఇంకా తిరగవచ్చు. ఎదగొచ్చు.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల భూముల్లోనే ఇప్పటివరకు నిర్మాణాలు ఇంకా రాలేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా వచ్చేసింది. హెచ్ఎండిఏ పరిధి చాలా పెరిగింది. ఇంత భూమి పెట్టుకుని మొత్తం సిటీలోనే కిక్కిరిసిపోయేటట్లు 50…. 60 ఫ్లోర్లు కట్టేస్తే…. జనం అంతా ఒకే చోట పోగుపడి నీళ్లు లేక, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక, నిత్యం ట్రాఫిక్ తో నరకం చూస్తున్నారు. బంజర హిల్స్ జూబ్లీహిల్స్ లాంటి చోట ఇప్పటికీ ఐదు ఫ్లోర్లు మించి కట్టకూడదని నిబంధన ఉంది. మరి అదే నిబంధన సిటీ అంత ఎందుకు పెట్టరు. అలా చేస్తే నగరం ఇంకా పెరుగుతుంది. అవసరమైన చోటు తప్ప ఇలా 50….60 ఫ్లోర్ల టవర్లు కంట్రోల్ చేయాల్సిందే. కేటీఆర్ సృష్టించిన జీవో 50 నీ రద్దు చేస్తేనే నగరం బాగుపడుతుంది.

హైదరాబాద్ రోడ్లపై కారు నడపాలంటే చేతులు వణికి పోతున్నాయి.గంటలు గంటలు ట్రాఫిక్ లో మగ్గిపోతున్నారు జనం. దీంతో పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. ఇరుకు రోడ్లు… కిక్కిరిసిపోయిన వాహనాలతో సిటీలో నరకం చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నగరం హరిజంటల్ గా పెరగాలి.50 ….60 ఫ్లోర్లు టవర్లు కట్టుకొని జనం అంతా ఒకే చోట ఉండిపోతే బతుకులు నరకం అయిపోతాయి. వాటిని 20 ఫ్లోర్లకు గనుక కుదించి…. నగరాన్ని విస్తరిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రజల జీవితాన్ని నిర్ణయించాల్సింది రియల్ ఎస్టేట్ బిల్డర్లు కాదు… ప్రభుత్వాలు. రేవంత్ సర్కార్ ఆ దిశగా ఆలోచిస్తే ఇప్పటికైనా ఈ ఎఫ్ ఎస్ ఐ అరాచకాన్ని అడ్డుకోగలుగుతాం.

2014 నుంచి 2023 డిసెంబర్ వరకు హైదరాబాదులో నిర్మించిన హైరేజ్డ్ బిల్డింగ్ పర్మిషన్లపై సమగ్ర దర్యాప్తు ఆదేశిస్తే, అసలు అనుమతులు ఎందుకిచ్చారో ఎలా ఇచ్చారో మొత్తం వెలికి తీస్తే ఎఫ్ ఎస్ ఐ స్కాం మొత్తం బయటకు వస్తుంది. ఎఫ్ ఎస్ ఐ స్కాం వెనుక ఏ ఏ రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో… ఎవరెవరు అధికారులు ఉన్నారో… మంత్రులు ఎవరో బయటకు తీస్తే అసలు ఎన్ని వేల కోట్ల అక్రమాలు జరిగాయి… చివరికి హైదరాబాదును అవి ఎలా నరకం చేశాయో జనానికి తెలుస్తుంది.