గణేష్ నిమజ్జనం, రేవంత్ కీలక నిర్ణయాలు…!

నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 07:17 PMLast Updated on: Sep 16, 2024 | 7:17 PM

Ganesh Immersion Revanths Key Decisions

నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు సీపీ వివరించారు. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు.

పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సూచించిన సీఎం… సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.