Gangula Kamalakar: కరీంనగర్ కష్టమేనా.. గడ్డు పరిస్థితుల్లో గంగుల..
2009 నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గంగుల. కానీ గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రజల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నడూ లేనంత వ్యతిరేకత వచ్చింది.
Gangula Kamalakar: ఎవరు ఎన్ని సర్వేలు చేసినా తెలంగాణలో ఈసారి ఎన్నికలు మాత్రం గత ఎన్నికల్లాగా ఉండవు. అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు అన్ని పార్టీలకు ఉండటంతో గెలుపు, ఓటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అన్ని జిల్లాల్లో గట్టిపోరు నడిచే సూచనలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ కూడా ఈసారి టఫ్ వార్ చూసే అవకాశాలు ఉన్నట్టు కరీంనగర్‌లో టాక్ నడుస్తోంది. 2009 నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గంగుల. కానీ గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితులు చాలా మారిపోయాయి.
Mallu Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల సంపద దోచుకున్నాయి: సీఎల్పీ నేత
ప్రజల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నడూ లేనంత వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు ప్రతిపక్షాలు బలంగా మారాయి. దీంతో ఈసారి కరీంనగర్‌లో గంగుల కష్టపడక తప్పుదు అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కే శ్రీనివాస్ పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. బండి సంజయ్ ఎఫెక్ట్ మాత్రం గంగులకు గట్టిగానే తగిలే చాన్స్ ఉంది అంటున్నారు. గతంలో రెండుసార్లు బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన టెన్యూర్‌లో బండి గ్రాఫ్ బాగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇదే టైంలో బీఆర్‌ఎస్ పార్టీపై కొంత కాలంగా ప్రజల్లో వ్యతిరేక పెరుగుతోంది. ఇక గంగుల వ్యక్తిగతంగా కూడా కేడర్‌లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
దీనికి తోడు ఆయన గ్రానైట్ క్వారీలపై వచ్చిన ఆరోపణలు.. ముఖ్యంగా గంగుల టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గంగుల ఇమేజ్‌ను ఓ రేంజ్‌లో డ్యామేజ్ చేశాయి. ఇక రీసెంట్‌గా కరీంనగర్‌లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు కూడా ధ్వసం కావడం.. అక్కడ గంగుల పనితనానికి అద్దం పట్టింది. ఇదే అదునుగా ప్రతిపక్షాలు గంగులను ఎండగడుతున్నాయి. మంత్రి గారికి సినిమా యాక్టర్స్ మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి విషయంలో ఉండదంటూ ఆరోపిస్తున్నారు.
BRS SENTIMENT: బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా ? జాతీయ పార్టీని మడత పెట్టేశారా..?
ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోవడమంటే నిజంగా చాలా పెద్ద టాస్క్. ఇప్పటికే పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ప్రత్యర్థులు బలంగా ఉన్నారు. చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ క్యాడెట్ల కారణంగా కొంత ఓట్‌బ్యాంక్ చీలిపోయే ప్రమాదముంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఈసారి ఎన్నికలు గంగుల కమళాకర్‌కు అగ్నిపరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.