Ganta Srinivasa Rao: గంటా పార్టీ మారతారా ? ఆ మాటలకు అర్థం ఏంటి ?
గంటా శ్రీనివాసరావుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అందులోభాగంగా ఆ నియోజకవర్గంలో IVRS సర్వే కూడా నిర్వహిస్తోంది. కానీ గంటా శ్రీనివాసరావుకి మాత్రం అక్కడ పోటీ చేయడం ఇష్టం లేనట్టుంది.
Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైమ్ దగ్గరపడే వరకూ పాలిటిక్స్‌లో ఎన్నెన్నో చిత్రాలు చూడబోతున్నారు జనం. ఎవరు.. ఏ పార్టీలో ఉంటారో లాస్ట్ మినిట్ దాకా చెప్పడం కష్టమే. జగన్ వరసపెట్టి నియోజకవర్గాల్లో తమ పార్టీ ఇంఛార్జులను మారుస్తున్నారు. పనికి రాదు అనుకున్నోళ్ళని మడతపెట్టేస్తున్నారు. ఈ మడత పెట్టిన బ్యాచ్ అంతా రాబోయే కొన్ని రోజుల్లో టీడీపీకో.. జనసేనకో జంప్ అవడం ఖాయం. టీడీపీ, జనసేనలో సీట్లు ఆశించిన వాళ్ళు కూడా తమకు టిక్కెట్ రాకపోతే ఇలాగే జంపింగ్‌కి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అందులోభాగంగా ఆ నియోజకవర్గంలో IVRS సర్వే కూడా నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గంలో మంత్రి బొత్సా సత్యనారాయణ పోటీలో ఉండటంతో.. తాము కూడా సీనియర్ అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది టీడీపీ. అందుకే గంటాయే సరైనోడని డిసైడ్ అయింది. కానీ గంటా శ్రీనివాసరావుకి మాత్రం అక్కడ పోటీ చేయడం ఇష్టం లేనట్టుంది. ‘పార్టీ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలన్నది. కానీ నాకు విశాఖ జిల్లా నుంచి నిలబడాలని ఉంది. ఇప్పటిదాకా విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తున్నా’ అని చెప్పుకొచ్చారు గంటా. చీపురుపల్లి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. పార్టీయేమో నన్ను ఆలోచించి నిర్ణయం చెప్పమన్నది. నా మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు గంటా శ్రీనివాసరావు. సరే.. అంతవరకూ మాట్లాడితే ఓకే. కానీ, ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఉంది. రాష్ట్రంలో ఏయే పార్టీల వాళ్ళు స్థానాల మార్పుతో ఇష్టం లేక ఎక్కడెక్కడికి వెళ్ళి జాయిన్ అవుతున్నారో గంటా శ్రీనివాసరావు వివరించారు. వైసీపీతో మొదలుపెట్టి.. టీడీపీ దాకా టిక్కెట్లు రానివాళ్ళు, పార్టీ మారే వాళ్ళ గురించి ఏకరువు పెట్టారు.
BRS PLAN: నీళ్లతోనే కాంగ్రెస్‌ని కొట్టాలి.. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేలా బీఆర్ఎస్ ప్లాన్
ఈ టైమ్‌లో సీట్లు రానోళ్ళు పార్టీలు మారడం సహజం అన్నారు. టీడీపీలో సీటు లేదని చెప్పటంతోనే కేశినేని నాని పార్టీ వదిలిపెట్టారు. వైసీపీలో మొన్నటిదాకా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు. ఎంపీ సీటు ఇస్తామన్నా.. అది వద్దని ఆదిమూలం పార్టీ నుంచి బయటకు వచ్చారు.. అంటూ పరోక్షంగా తన మనసులో మాట బయటపెట్టారు. అంటే చీపురుపల్లిలో పోటీ చేయడం గంటాకు ఇష్టం లేదు. తాను విశాఖ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టేశారు. టీడీపీ మరో వారం రోజుల్లో అభ్యర్దులను ఖరారు చేస్తుందనీ.. జనసేనతో సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చల దశలో ఉందన్నారు గంటా. అయితే సీటు రానప్పుడు పార్టీ మారడం పెద్ద విషయం కాదంటూ గంటా చేసిన వ్యాఖ్యలే టీడీపీ వర్గాల్లో కలకలకం రేపుతన్నాయి. విశాఖ టిక్కెట్ ఇవ్వకపోతే గంటా పార్టీ మారతారా అన్న చర్చ మొదలైంది. గంటా ఎప్పటి నుంచో విశాఖ స్థానం నుంచే గెలుస్తున్నారు. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్ బీజేపీకి వెళ్తుందని అంటున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచిస్తోంది. కానీ ఆయన మాత్రం భీమిలి నుంచి దిగుతానంటున్నారు. గంటా నిర్ణయంపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నిజంగా విశాఖ వదిలిపోవడం గంటాకు ఇష్టం లేదా… లేదంటే బొత్స చేతిలో ఓడిపోతానన్న భయంతోనే చీపురుపల్లిలో పోటీకి వెనక్కి తగ్గుతున్నారా అన్నది తెలియడం లేదు.