హమాస్‌పై తిరగబడిన గాజా, ప్రజలు ఫలించిన నెతన్యాహు మైండ్ గేమ్..!

గెటౌట్ ఫ్రమ్ గాజా'.. ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత గాజాలో రీసౌండ్ ఇస్తున్న స్లోగన్ ఇది. ఒకరు ఇద్దరూ కాదు.. గాజాలోని వేల మంది పాలస్తీనియన్లు ధ్వంసమైపోయిన రోడ్లపైకి వచ్చి గెటౌట్ ఫ్రమ్ గాజా అంటూ ర్యాలీలు తీస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2025 | 10:40 AMLast Updated on: Mar 27, 2025 | 10:40 AM

Gaza Turned Against Hamas Netanyahus Mind Game Paid Off With The People

గెటౌట్ ఫ్రమ్ గాజా’.. ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత గాజాలో రీసౌండ్ ఇస్తున్న స్లోగన్ ఇది. ఒకరు ఇద్దరూ కాదు.. గాజాలోని వేల మంది పాలస్తీనియన్లు ధ్వంసమైపోయిన రోడ్లపైకి వచ్చి గెటౌట్ ఫ్రమ్ గాజా అంటూ ర్యాలీలు తీస్తున్నారు. ఇస్లామిక్ దేశాలు సైతం ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేని డిమాండ్‌తో హమాస్‌కు శాపనార్థాలు పెడుతున్నారు. హమాస్ సైతం ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడింది. వెంటనే ఇజ్రాయెల్‌కు అల్టిమేటం జారీ చేసింది. గాజాలో దాడులు ఆపకపోతే.. బందీలంతా శవపేటికల్లోనే తిరిగొ స్తారని వార్నింగ్ ఇచ్చింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు సరికదా.. తన దాడుల్లో డోస్ పెంచింది. ఈ పరిణామాలతో గాజా గజగజ వణుకిపోతోంది.

ఇజ్రాయెల్ విధ్వంసకర దాడుల తర్వాత గాజాలో సిట్యువేషన్ ఇది. గాజాలో ఇలాంటి ఓ సీన్ కనిపిస్తుందని పాలస్తీనా, దానికి మద్దతిచ్చే ఇస్లామిక్ దేశాలు కలలో కూడా ఊహించి ఉండవు. వీళ్లంతా ఎవరు? ఎమని నినదిస్తున్నారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. గాజాలో రోడ్లపైకి వచ్చింది పాలస్తీనా పౌరులు.. ఆ ప్రాంతం నుంచి హమాస్ వెళ్లిపోవాలనేది వాళ్ల డిమాండ్. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. దీనివెనుక చాలాపెద్ద కథే ఉంది. అంతకుమించి నెతన్యాహు మైండ్ గేమ్ కూడా ఉంది. రెండోసారి గాజాలో దాడులు మొదలు పెట్టిన తర్వాత అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఐడీఎఫ్ భారీ దాడులకు అనేక మంది ప్రజలు శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో హమాస్‌ కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలపుతున్నారు. సంఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ వేలమంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. గాజాలో ప్రజలను రక్షించేందుకు హమాస్‌ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. కట్‌చేస్తే.. హమాస్ ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది.

ఎప్పుడైతే గాజాలో పాలస్తీనియన్లు తిరగబడ్డారో హమాస్‌కు రియాలిటీ అర్ధమైంది. వెంటనే టెల్ అవీవ్‌పై బెదిరింపులకు దిగింది. దాడులను ఇలాగే కొనసాగించి, సైన్యం సాయంతో బందీలను తరలించే ప్రయత్నం చేస్తే.. తమ దగ్గరున్న బందీలు శవపేటికల్లో తిరిగొస్తారని హెచ్చరించింది. కానీ, అక్కడున్నది నెతన్యాహు.. హమాస్ బెదిరింపులకు తలొగ్గే వ్యక్తి కాదు.. హమాస్ దగ్గరున్న 59 మంది బందీలను విడిచిపె డితేనే దాడులు ఆగుతాయని తేల్చి చెప్పారు. అంతేకాదు, గాజా సిటీలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయా లని పౌరులను ఆదేశించారు. జీటౌన్‌, టెల్‌ అల్‌-హవా తదితర ప్రాంతాల పౌరులు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రమూకలు చేపట్టిన రాకెట్ దాడులకు త్వరలో సమాధానం చెబుతామని ప్రకటించారు. దీంతో గాజా పౌరుల్లో మరింత భయం పెరిగింది. ఫలితంగా గాజా నుంచి హమాస్ వైదొలగాల్సిందే అని నిరసనల్లో జోరు పెంచారు. గాజా పౌరుల నుంచి నెతన్యాహు కోరు కుంటోంది ఇదే.

గతేడాది సెప్టెంబర్‌లో పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రిసెర్చ్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. గాజాలో 35 శాతం మంది పాలస్తీనా పౌరులు హమాస్‌కు మద్దస్తున్నట్టు తేలింది. 26 శాతం మంది రమల్లాకు చెందిన పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్ పార్టీ ఫతా వైపు ఉన్నారు. ఇటీవల ఫతా ప్రతినిధి, మొంథర్‌ అల్‌ హయెక్‌ పాలస్తీనియన్ల అస్తిత్వాన్ని కాపాడేందుకు పరిపాలన నుంచి తప్పుకోవాలని హ మాస్‌కు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇటీవలే గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13లక్షలమంది గాయపడినట్లు వెల్లడించింది. రెండోవిడత దాడులు మొదలుపెట్టిన తర్వాత 900 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల మొదట్లో మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో గాజా పరిస్థితులు మరింత క్షీణించాయి. దీంతో హమాస్‌కు వ్యతిరేకంగా పౌరులు రోడ్డెక్కారు.

గాజాలో ఎప్పటిపరిస్థితుల్లో హమాస్ ఉండొద్దన్నదే నెతన్యాహు టార్గెట్. ఈ విషయంలో దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కానీ, గాజాలో పాలన పేరుతో హమాస్ అక్కడ పాతుకుపోయింది. గాజాలో హమాస్ ఉన్నంతవరకూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉండదు. గాజా నుంచి హమాస్ వైదొలగాలంటే అక్కడి ప్రజలు తలచుకుంటేనే జరుగుతుంది. ఈ లక్ష్యంతోనే రెండోసారి గాజాలో భీకర దాడులు మొదలు పెట్టారు. మార్చి 1న కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ముగిసింది. హమాస్‌ దగ్గర ఇంకా 59 మంది బందీలున్నారు. వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. అయినా, రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు మమాస్ అంగీక రించలేదని చెబుతూ గాజాలో మళ్లీ యుద్ధం ప్రారంభించింది. గతంతో పోల్చితే దాడుల్లో తీవ్రత పెంచింది. ఈ చర్యలకు అమెరికా మద్దతు ఇస్తోంది. దీంతో గాజాలోని పౌరులకు ఒక క్లారిటీ వచ్చింది. హమాస్ అక్కడ ఉన్నంత కాలం తమ జీవితాలు ఇంతే దుర్భరంగా ఉంటాయనే అంచనాకు వచ్చారు. అందుకే, హమాస్ గెటౌట్ అంటూ రోడ్డెక్కారు. ఈ పరిణామాలు గాజాలో ఊహకందని మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.