Ambati Rayudu : పొలిటికల్ ఇన్నింగ్స్‌కు అంబటి రాయుడు గుడ్ బై
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన రాయుడు.. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు రాయుడు. అంబటికి గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి సీటు ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, అంబటి నర్సరావు పేట సీటు కోరుకున్నట్లు సమాచారం. కానీ, ఆ సీటు ఇవ్వటం లేదని తెలియటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన రాయుడు.. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు రాయుడు. అంబటికి గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి సీటు ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, అంబటి నర్సరావు పేట సీటు కోరుకున్నట్లు సమాచారం. కానీ, ఆ సీటు ఇవ్వటం లేదని తెలియటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆడుతున్న సమయంలోనే పలు సందర్భాల్లో రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఆ తరువాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.
జగన్ కార్యక్రమాలను ప్రశంసించారు. పలు చర్చల్లోనూ జగన్‌ను ఎందుకు అభిమానించిందీ వివరించారు. తనకు క్రికెట్‌లో ధోనీ గాడ్ ఫాదర్ అని..రాజకీయాల్లో జగన్ గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. 2023 ఐపీఎల్ గెలిచిన తరువాత చెన్నై టీం యాజమాన్యంతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. ఆ తరువాత రాయుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయినట్లుగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం అంబటి రాయుడు అధికారికంగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గుంటూరు ఎంపీ సీటు రాయుడుకు ఖాయమనే ప్రచారం పార్టీలో వినిపించింది. రాయుడిని గుంటూరు లేదా నర్సరావు పేట నుంచి బరిలోకి దింపే విధంగా పార్టీలో ఆలోచన జరిగింది.
తాజాగా సర్వే నివేదికల్లో రాయుడకు అనుకూలంగా లేకపోవటంతో సీటు పైన హామీ దక్కలేదని తెలుస్తోంది. అభ్యర్దుల ఖరారు కసరత్తులో భాగంగా నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ క్రిష్ణదేవరాయులను గుంటూరుకు పంపి.. అక్కడ అంబటి రాయుడును దింపే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. కానీ, ప్రస్తుతం ఇది కూడా సాధ్యం అయ్యేలా కనిపించ లేదు. దీంతో తనకు సీటు రాదనే నిర్ణయానికి రాయుడు వచ్చారు. దీంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అయితే, క్రికెటర్‌గా రాయుడు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఎంత వేగంగా వైసీపీలో చేరారో.. అంతే వేగంగా పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత అంబటి రాయుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.