CONGRESS MP Tickets: కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం అధికారులు క్యూ !
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆశావహులంతా గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. పార్టీ సీనియర్ నేతల దగ్గర నుంచి టికెట్ ఆశిస్తున్న బయటి వ్యక్తులు కూడా అప్లయ్ చేశారు.
CONGRESS MP Tickets: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్స్ కోసం ప్రభుత్వ అధికారులు క్యూ కడుతున్నారు. గాంధీభవన్‌లో దరఖాస్తులు నింపేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ను భుజాల మీద మోసిన గడల శ్రీనివాసరావు కూడా ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆశావహులంతా గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?
పార్టీ సీనియర్ నేతల దగ్గర నుంచి టికెట్ ఆశిస్తున్న బయటి వ్యక్తులు కూడా అప్లయ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గాంధీభవన్ కి వచ్చి అప్లికేషన్స్ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు.. కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. అందుకోసం మహబూబాబాద్ లోక్‌సభ సీటుకు దరఖాస్తు పెట్టుకున్నారు రమేష్ భట్టు. మాజీ డి.హెచ్ గడల శ్రీనివాస్‌ది మరో ఎత్తు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు పాదాభివందనం చేయడం, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కి పోటీ పడటం.. లాంటి పనులతో అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు గడల. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అవ్వాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. టికెట్ దక్కపోవడంతో అప్పట్లో సైలెంట్ అయ్యారు. ఇంతలో తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చింది. ఆ వెంటనే నాడు వివాదాలతో అంటకాగిన గడల శ్రీనివాస్‌ను డి.హెచ్ పదవి నుంచి తప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఆయన మైండ్‌సెట్ కూడా మారిపోయింది.
వెంటనే ప్లేట్ ఫిరాయించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయాలనుకున్నారు. తన సన్నిహితుడితో దరఖాస్తును గాంధీభవన్ కి పంపారు. సికింద్రాబాద్, ఖమ్మం రెండు పార్లమెంటు సీట్ల కోసం అప్లయ్ చేసుకున్నారాయన. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేరే సంగతిగానీ.. ఇదే సమయంలో ఆయన గురించి మరో చర్చ జరుగుతోంది. మాజీ DH నిజంగానే రాజకీయాలు చేయాలని ఆసక్తిగా ఉన్నారా? లేక ఇలాంటి ఎత్తుగడలతో జనం నోళ్ళలో నాని చర్చనీయాంశం అవ్వాలనుకుంటున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. నాడు బీఆర్‌ఎస్‌ను భుజాల మీద మోసి.. అధికారా? ఆ పార్టీ కార్యకర్తా అని అనుమానాలు వచ్చేలా ప్రవర్తించిన మాజీ హెల్త్ డైరెక్టర్.. ఇప్పుడు ఠక్కున ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్ టిక్కెట్ కోసం అప్లయ్ చేయడంతో కాకలు తీరిన రాజకీయ నేతలే ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆ దరఖాస్తును ఏం చేస్తారో చూడాలి.