Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!
వాళ్ళూ.. వీళ్లూ కాదు.. వస్తే మళ్లీ ఆయన్నే భీమవరం రమ్మనండి.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాం.. ఈవీఎం మీద ఒట్టు అంటున్నారట గ్రంధి. ఏంటయ్యా.. అంత కాన్ఫిడెన్స్.. పవన్‌కు బదులు జనసేన లోకల్ లీడర్స్ వస్తారులే.. ఆయన దాకా ఎందుకంటే.. కాదు.. కాదు.. పవనే కావాలంటున్నారట.
Grandhi Srinivas: రమ్మను.. మళ్ళీ పవన్ కల్యాణ్ నే రమ్మను. తాడో పేడో.. అదే బరిలో మరోసారి తేల్చేసుకుంటాం అంటున్నారు ఆంధప్రదేశ్‌లోని.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. గత ఎన్నికల్లో జైంట్ కిల్లర్‌గా నిలిచినా.. తగిన గుర్తింపు రాలేదని ఆవేదనగా ఉన్న ఆ శాసనసభ్యుడు మరోసారి పవన్‌ను ఓడించి ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు. అదే టైంలో అదృష్టం ఎప్పుడూ ఒక వైపే ఉండదురా బాబూ.. అన్న సెటైర్స్ కూడా ఆయన మీద పడుతున్నాయట. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద గెలిచి జైంట్ కిల్లర్‌గా రాష్ట్రమంతటా పాపులర్ అయ్యారు. తిరిగి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి జనసేనాని మీదికి సై అంటూ తొడగొడుతున్నాడు.
Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!
వాళ్ళూ.. వీళ్లూ కాదు.. వస్తే మళ్లీ ఆయన్నే భీమవరం రమ్మనండి.. ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాం.. ఈవీఎం మీద ఒట్టు అంటున్నారట గ్రంధి. ఏంటయ్యా.. అంత కాన్ఫిడెన్స్.. పవన్‌కు బదులు జనసేన లోకల్ లీడర్స్ వస్తారులే.. ఆయన దాకా ఎందుకంటే.. కాదు.. కాదు.. పవనే కావాలంటున్నారట. అందుకాయన లెక్కలు కూడా వేరే ఉన్నాయంటున్నాయి భీమవరం పొలిటికల్ సర్కిల్స్. స్థానిక నాయకులు పోటీ చేస్తే.. గతంలోకంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందనీ.. ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనీ.. అదే పవన్ అయితే లోకల్, నాన్ లోకల్ నినాదంతో ఈజీగా గెలవవచ్చన్నది ఆయన లెక్కగా చెబుతున్నారు. తన మాటల మర్మాన్ని అనుచరులకు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారట గ్రంథి శ్రీనివాస్.. ఇతర పార్టీల్లోని లోకల్ లీడర్లు తనపై పోటీకొస్తే.. ప్రచారం నుంచి పోల్ మేనేజ్ మెంట్ దాకా అన్నింటిలోనూ పోటా పోటీగా ఉంటుంది. అందుకే నాన్ లోకల్ అయిన పవన్ అయితేనే బెటర్ అన్నది భీమవరం ఎమ్మెల్యే అభిప్రాయంగా తెలిసింది. ఆయన నియోజకవర్గ అభివృద్ధి మీద ఏ మాత్రం శ్రద్ధ చూపించగలరో ఓటర్లకు వివరించడం తేలికవుతుందన్నది గ్రంథి అభిప్రాయంగా చెబుతున్నారు సన్నిహితులు.
AMBATI RAYUDU: ఏపీ పొలిటికల్ లీగ్‌లో.. అంబటి రాయుడు నిలబడతాడా..?
అదే సమయంలో తమ నాయకుడికి మరో దూరపు చూపు లెక్క కూడా ఉందంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. గత ఎన్నిల్లో జనసేన అధినేతను ఓడించినా.. తన సొంత పార్టీ అధ్యక్షుడిని మెప్పించలేకపోయారనీ.. అందుకే ఆయనకు మంత్రి పదవి దక్కలేదన్నది లోకల్ టాక్. తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అన్నీ ఇచ్చి గ్రంధికి మాత్రం… చాలా కాలం వరకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై ఆయన వర్గం అసంతృప్తిగా ఉన్న విషయం వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లిందట. దీంతో పార్టీ అధినేత పిలిచి పక్కాగా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోసారి అధికారంలోకి రాగానే మంత్రి పదవి గ్యారంటీ అన్న భరోసా వచ్చిందట గ్రంథి శ్రీనివాస్‌కు. అందుకే వాళ్ళు వీళ్ళు ఎందుకు మరోసారి పవన్‌కళ్యాణ్‌నే ఓడిస్తే.. మారు మాట్లాడకుండా మంత్రి పదవి ఇస్తారని అంచనా వేస్తున్నారట ఎమ్మెల్యే. జనసేనాని మీద తొడగొట్టడానికి అది కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు సన్నిహితులు. అయితే అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడివిడిగా పోటీచేయడం ఓట్లు చీలిపోయి గ్రంథి విజయం తేలికైందని, ఈసారి అదంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.
అయితే అందుకు కౌంటర్ ప్లాన్ వేరే ఉందట. టిడిపి తరపున బరిలో దిగాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేతలంతా.. ఈసారి టిక్కెట్ జనసేనకు వెళుతుందని ఇప్పటికే ఫిక్సయ్యారట. పైగా భీమవరం టిడిపిలో వర్గపోరుతో ఆపార్టీలో నేతలంతా ఎవరికి వారే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇదే అదునుగా ఎమ్మెల్యే గ్రంధి టిడిపి అసంతృప్తులందరినీ తనకి అనుకూలంగా మరల్చుకుంటున్నారన్నది సమాచారం. పవన్ పోటీ చేస్తే క్రింది స్థాయిలో రెండు పార్టీల నేతలంతా కలిసి పనిచేయకుండా స్కెచ్ వేస్తున్నారట గ్రంథి. దీంతో ఈ పొలిటికల్ వార్‌లో పరిస్థితులు చివరికి ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.