GVL Narasimha Rao: జీవీఎల్ దారెటు.. జీవీఎల్‌ మీద కసి తీర్చుకున్న చంద్రబాబు!

ఈసారి ఎలాగైనా వైజాగ్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు.. చంద్రబాబు షాక్ ఇచ్చారు. టీడీపీ అనౌన్స్‌ చేసిన మూడో జాబితాలో 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్‌ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విశాఖ నుంటి టీడీపీ తరఫున శ్రీభరత్ పోటీ చేయబోతున్నారని ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 06:24 PMLast Updated on: Mar 22, 2024 | 6:24 PM

Gvl Narasimha Rao Not Got Vizag Ticket Tdp Announced Candidate What Is Next Step Of Gvl

GVL Narasimha Rao: విశాఖ ఎంపీగా పోటీ చేయాలని.. జీవీఎల్‌ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సమయం చిక్కినప్పుడుల్లా వైజాగ్‌లో ప్రత్యక్షం కావడం.. టీడీపీ, వైసీపీ మీద విమర్శలు గుప్పించడం.. అవసరం లేకపోయినా కాపు సంఘాల మీటింగ్‌కు హాజరు కావడం.. ఇలా జీవీఎలా రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ఇదీ తన బలం అని పార్టీ అధిష్టానానికి నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

AP POLITICS: ఏపీలో చల్లబడ్డ రాజకీయం.. కనిపించని ఎన్నికల హడావిడి.. కారణం ఇదే..!

ఐతే ఈసారి ఎలాగైనా వైజాగ్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు.. చంద్రబాబు షాక్ ఇచ్చారు. టీడీపీ అనౌన్స్‌ చేసిన మూడో జాబితాలో 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్‌ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. విశాఖ నుంటి టీడీపీ తరఫున శ్రీభరత్ పోటీ చేయబోతున్నారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో జీవీఎల్‌కు షాక్ తగిలినట్లు అయింది. రెండేళ్లుగా విశాఖలో మకాం వేసి మరీ.. జీవీఎల్‌ ప్రచారం చేసుకుంటున్నారు. తనకే విశాఖ సీటు అని నిబ్బరంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు టీడీపీ తరఫున అభ్యర్థిని ప్రకటించడంతో.. ఆయనకు షాక్ తగిలినట్లు అయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీభరత్‌.. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. లాస్ట్ టైమ్ అంటే.. జేడీ లక్ష్మీనారాయణ ఓట్లు చీల్చడంతో ఓడిపోయారని.. ఈసారి శ్రీభరత్‌కు విజయావకాశాలు పుష్కలం అని బీజేపీ దగ్గర వాదించి.. ఆ సీటును తన ఖాతాలో వేసుకుంది. కానీ, విశాఖలో బీజేపీకి కూడా మంచి ట్రాక్‌ రికార్డ్ ఉంది.

ఐతే, ఇదంతా ఎలా ఉన్నా.. జీవీఎల్‌కు టికెట్‌ రాకపోవడంతో.. సోషల్‌ మీడియాలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. నిజానికి టీడీపీతో పొత్తును మొదటి నుంచి వ్యతిరేకించిన వారిలో జీవీఎల్ ముందువరుసలో ఉంటారు. పైగా వైసీపీ అనుకూల బీజేపీ నేత అని టీడీపీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌కు టికెట్‌ ఇవ్వాలని ఓ వైపు.. జీవీఎల్‌ మరోవైపు.. విశాఖ మీద టీడీపీ పట్టు పట్టింది. జీవీఎల్ మీద కసి తీర్చుకుంది అనే టాక్‌ సోషల్‌ మీడియాలో జోరుగా నడుస్తోంది.