జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో సగం కాలిపోయిన నోట్లు మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో...కాలిపోయిన నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో...జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యక్తిత్వంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 02:15 PMLast Updated on: Mar 24, 2025 | 2:15 PM

Half Burnt Notes At Justice Yashwant Vermas House Questioning With Judges Of Three State High Courts

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో…కాలిపోయిన నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో…జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యక్తిత్వంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీం చీఫ్ జస్టిస్ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన నివేదికను వెబ్ సైట్ లో పెట్టింది సుప్రీం.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం… దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్చి 14న లుట్యెన్స్‌ ప్రాంతంలోని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్ని మాపక విభాగం చీఫ్‌ అతుల్‌ గర్గ్‌.. తొలుత ఎటువంటి నోట్ల కట్టలను గుర్తించలేదని చెప్పారు. ఆ తర్వాత తాము నోట్ల కట్టలు దొరకలేదన్న విషయాన్ని చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ…25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. జస్టిస్ డికే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అందులో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డికే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందు కోసం మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్‌ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్‌. సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్‌ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు.

స్టోర్‌ రూంలో తాను, తన కుటుంబ సభ్యులు ఎలాంటి నగదు ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు వివరణ ఇచ్చారు జస్టిస్ యశ్వంత్ వర్మ. తమ ఇంట్లో నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనను అప్రతిష్ఠ పాల్జేయడానికి కుట్రలు చేస్తున్నారని వాపోయారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని భార్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు
.https://images.indianexpress.com/2025/03/Video-as-shared-by-the-Commissioner-of-Police-Delhi-with-the-Chief-Justice-of-the-High-Court-of-Delhi-2.mp4?_=1