Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ కనీసం 60 శాతం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. మధ్యలో సినిమా షూటింగ్‌కు బ్రేక్ రావడంతో సినిమా ఆగిపోయిందని ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Harihara Veeramallu's shooting was stopped due to Pawan Varahi's yatra with the intention of early elections in AP
మొదట్లో నార్మల్‌గానే ఉన్నా తరువాత దర్శక నిర్మాతలు వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడలేదు. దీంతో సినిమా ఆగిపోలేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే రీసెంట్‌గా సినిమాకు లాంగ్ గ్యాప్ రావడంతో మరోసారి సినిమా గురించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో స్ప్రెడ్ అవుతున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే విషయంలో సినిమా నిర్మాత ఎం.రత్నం రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చామంటూ చెప్పారు. పవన్ కళ్యాన్‌కు బ్యాక్ టు బ్యాక్ యాత్ర షెడ్యూల్స్ ఉన్న కారణంగా షూటింగ్‌కు ఇబ్బందిగా మారిందన్నారు. ఆయన ప్రజల కోసం పోరాడుతన్నారు కాబట్టి ఆయనను తాము అర్థం చేసుకున్నామంటూ చెప్పారు రత్నం. ఏపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకుంటామన్నారు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నకలు ఉంటే ఆగస్ట్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు.
ఒకవేళ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఎన్నికలు పూర్తయ్యాకే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం సినిమా షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టే షూటింగ్‌కు మధ్యమధ్యలో గ్యాప్ వస్తుందని చెప్పారు. ఫ్యాన్స్ ఎవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని.. హరిహర వీరమల్లు సినిమాను ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రొడ్యూసర్ క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.