శ్రీతేజ్ ఒక్కడే మనిషా…? హరీష్ సంచలనం

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 06:21 PMLast Updated on: Dec 26, 2024 | 6:21 PM

Harish Rao Fire On Revanth Reddy 3

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. దురదృష్టకరమైన ఘటన లో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ గారి సూచనతో బీ ఆర్ ఎస్ నేతలం పరామర్శించామన్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నార, వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారన్నారు హరీష్. శ్రీతేజ్ కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారని భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.

కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్క ర్ రావు నేతృత్వం లో శ్రీతేజ్ కు మంచి వైద్యాన్ని అందిస్తోందన్ని తొక్కిసలాట లో మరణించిన రేవతి కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అన్నారు. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్ ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామన్న హరీష్ రేవతి అందరి మనసును కరిగేలా చేసిందన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితన్నారు.

సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం ,మంత్రులు స్పందించారని గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ,ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రెవంత్ కొండారెడ్డి పల్లి లో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య కు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని నిలదీశారు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు ? అని నిలదీశారు.