రేవంత్ నేను రెడీ, హరీష్ రావు సెన్సేషన్

పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. సీఎం మాట్లాడుతుంటే తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడ్తున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 05:10 PMLast Updated on: Oct 30, 2024 | 5:10 PM

Harish Rao Reacts On Revanth Reddy Comments

పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. సీఎం మాట్లాడుతుంటే తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడ్తున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సిగ్గు పడ్తారు అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు, దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని రేవంత్ అనటం హాస్యాస్పదమన్నారు.

ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు హరీష్. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు. రేవంత్ CM అయ్యేది కాదన్నారు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చూసుకోవాలి అని హితవు పలికారు. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్ ఉన్నాడన్నారు. ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్. సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేసారు. దేశంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడింది. కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? అని ప్రశ్నించారు. ఆరు మంత్రి పదవులను నింపడానికే రేవంత్ కయ హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదన్నారు. వాడపల్లి నుంచి పాదయాత్రకు తాను సిద్దమని రేవంత్ కు ప్రతి సవాల్ చేసారు హరీష్.