100 కోట్లతో దుబాయ్‌కి జంప్ ?
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్స్ చేసిన కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్లను పోలీసులు వెంటాడుతున్నారు. ఇప్పటికే 23 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రీతూ చౌదరి, విష్ణుప్రియను విచారించారు.

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్స్ చేసిన కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్లను పోలీసులు వెంటాడుతున్నారు. ఇప్పటికే 23 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రీతూ చౌదరి, విష్ణుప్రియను విచారించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న హర్షసాయి, ఇమ్రాన్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. తప్పించుకుని తిరుగుతున్నారు. ఇమ్రాన్ ఇంటి వద్ద హర్షసాయి ఇంటి వద్ద కూడా పోలీసులు గాలింపు చేపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసేందుకు ఈ ఇద్దరు ప్రమోటర్ల దగ్గర భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ డబ్బుతో హర్షసాయి ఇమ్రాన్ ఇద్దరూ కూడా దుబాయ్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో బిజినెస్ పెట్టబోతున్నానంటూ గతంలో ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను అనుకున్న డబ్బు సమకూరిన వెంటనే దుబాయ్ వెళ్లిపోతానంటూ చెప్పాడు. ఇప్పుడు ఇదే పనిలో ఇమ్రాన్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక హర్షసాయి కూడా ఇమ్రాన్ మాదిరిగానే పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రీసెంట్‌గా హర్షసాయి మీద ఓ అమ్మాయి కేసు పెట్టినప్పుడు కూడా ఇదే మాదిరిగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు హర్షసాయి ఇప్పుడు కూడా అదే మాదిరిగా పోలీసుల కంట పడకుండా ఇమ్రాన్, హర్షసాయి ఇద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారు. వీళ్లిద్దరి కాల్ డేటాతో పాటు బ్యాంక్ అకౌంట్ లావాదేవీల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.