ద్మముంటే పట్టుకోరా షికావత్ పాట రిలీజ్ & డిలీట్ పుష్పకు భయం తగ్గలేదా?

ఒకవైపు సంధ్య థియేటర్ ఘటన నుంచి ఎలా బయటకు రావాలా అని నానా తిప్పలు పడుతున్న అల్లు అర్జున్ కు అసలు టైమ్ ఏ మాత్రం బాగాలేదు. చేసిన తప్పుకు చేయని తప్పుకు కూడా బలైపోతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు మరో రూపంలో దరిద్రం వెంటాడింది ఐకాన్ స్టార్ ని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 07:24 PMLast Updated on: Dec 25, 2024 | 7:24 PM

Has The Release Deletion Of The Song Dmamunte Pattkorara Shikavat Not Reduced Pushpas Fear

ఒకవైపు సంధ్య థియేటర్ ఘటన నుంచి ఎలా బయటకు రావాలా అని నానా తిప్పలు పడుతున్న అల్లు అర్జున్ కు అసలు టైమ్ ఏ మాత్రం బాగాలేదు. చేసిన తప్పుకు చేయని తప్పుకు కూడా బలైపోతున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు మరో రూపంలో దరిద్రం వెంటాడింది ఐకాన్ స్టార్ ని. ఫ్యాన్స్ కోసం సినిమా చూడటానికి వెళ్తే రాత్రి మొత్తం జైల్లో గడిపిన అల్లు అర్జున్.. పాపం రెండు సార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏ ముహూర్తంలో పుష్ప సినిమా మొదలుపెట్టాడో గాని దరిద్రం మాత్రం వెంటాడుతూనే ఉంది.

ఫ్యాన్స్ కోసం పైకి లేచి చెయ్యి ఊపడం కూడా పాపం అయిపోయింది. పగలు ఊపినా బాగుండేది గాని అర్ధరాత్రి ఊపడంతో ఓ ప్రాణం పోయి మరో ప్రాణం గాల్లో దీపం అయింది. ఇక అక్కడి నుంచి కష్టాల మీద కష్టాలు వచ్చాయి. పుష్ప రెండు పార్టులు బన్నీ చూపిస్తే మూడో పార్ట్ రేవంత్ రెడ్డి చూపించారు జనాలకు. విమర్శలు కూడా ఏ మాత్రం తక్కువ రాలేదు ఈ స్టార్ హీరోకు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్ట్ వరకు కూడా వెళ్ళారు. మంగళవారం నాలుగు గంటలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు.

ఇక ఇక్కడి నుంచే తెలియకుండా మరో పెంటపై రాయి పడింది. బన్నీ సరిగ్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు అయిన సమయంలోనే టీ సీరీస్ పుష్ప 2 సినిమాలో ఒక పాట రిలీజ్ చేసింది. యూ ట్యూబ్‌లో దమ్ముంటే పట్టుకోరా అనే పాటను రిలీజ్ చేసారు. ఈ పాట అసలు సినిమాలో లేదు. కాని ఇక్కడ మాత్రం రిలీజ్ చేసారు. ఎవరు ఏం చేసినా బన్నీనే చేసాడని రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కంటే పోలీసులు మరింత ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఓ వైపు కేటిఆర్ నోటి దూలతో లేనిపోనీ సమస్యలు ఎదుర్కొన్నాడు బన్నీ.

ఇప్పుడు ఈ పాటతో మరో సమస్య ఎదుర్కొనే సిగ్నల్స్ వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలో ఎస్పీ షికావత్‌కు పుష్ప సారీ చెప్పే సీన్ లో… అంటే ఇంటర్వెల్ టైం సీన్ లో ఇగో హర్ట్ అయిన పుష్ప మళ్లీ వెనక్కి వచ్చి, పోలీస్ ఆఫీసర్ షెకావత్ తో ఒక డైలాగ్ చెప్తూ రికార్డ్ చేసుకోమంటాడు. దమ్ముంటే పట్టుకోరా షికావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు… మళ్ళీ గోడ్డలేసి పోతారా అడవికేసి అనే డైలాగ్ తో సాంగ్ రిలీజ్ చేసారు. విచారణ జరుగుతుంటే ఈ డైలాగ్ సాంగ్ టీ సీరీస్ రిలీజ్ చేయడంతో… రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకుని సాంగ్ రిలీజ్ చేసారని ట్రోల్ చేస్తున్నారు. దారిన పోయే కంప చీరకు తగిలినట్టు… టీ సీరీస్ వాళ్ళు రిలీజ్ చేసిన పాట కూడా ఇప్పుడు పెంట పెంట అవుతోంది. ఇక ఆలస్యంగా రియలైజ్ అయిన పుష్ప టీం అలెర్ట్ అయింది. అనవసర వివాదం వద్దనుకుని… సాంగ్ ను డిలీట్ చేయించింది. దీనితో పుష్ప భయపడ్డాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.