Top story: షేప్ మారిందా ? లేదంటే మార్చేశారా ? బిత్తర చూపులు చూస్తున్న వల్లభనేని, పోసాని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళికి ఏమయింది ? ఆ లుక్కేంటి ? ఆ నెరసిన గడ్డం ఏంటి ? మేకప్ తో తమ ఏజ్ ను దాచి పెట్టేశారా ? జైలుకు వెళ్లాక ఇద్దరి నేతల వ్యవహారశైలి మారిపోయిందా ? గుర్తు పట్టలేని విధంగా మారిపోవడానికి కారణాలు ఏంటి ?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళికి ఏమయింది ? ఆ లుక్కేంటి ? ఆ నెరసిన గడ్డం ఏంటి ? మేకప్ తో తమ ఏజ్ ను దాచి పెట్టేశారా ? జైలుకు వెళ్లాక ఇద్దరి నేతల వ్యవహారశైలి మారిపోయిందా ? గుర్తు పట్టలేని విధంగా మారిపోవడానికి కారణాలు ఏంటి ?
వల్లభనేని వంశీ మోహన్…ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివాదాస్పద, అసభ్యకర వ్యాఖ్యలు చేసి కష్టాలను తెచ్చుకోవడంలో ముందుంటారు. వరుసగా కేసులు నమోదయి.. జైలుకు పరిమితం అయ్యారు. వంశీపై రిమాండ్ల మీద రిమాండ్లు కంటిన్యూ అవుతున్నాయి. రెండ్రోజుల క్రితం వల్లభనేని వంశీమోహన్ కోర్టుకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ కారు దిగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. తెల్ల జుట్టు, నెరసిన గడ్డంతో కోర్టు ఆవరణంలో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుర్తు పట్టలేని విధంగా మారిన వంశీని చూసి…ఎందుకిలా అయిపోయాడనే చర్చ నడుస్తోంది. జైలుకు వెళ్లినప్పటి నుంచి జుట్టుకు రంగేసుకోవడం లేదా ? లేదంటే పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ తో మొత్తం స్టైల్ ను మార్చేశారా ? అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
సాధారణంగా వల్లభనేని వంశీ మోహన్ చలాకీగా ఉంటారు. ఆయన వయసు 53 ఏళ్లు. డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంటుంది. చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. యంగ్ లుక్ తో ఉంటారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా జైలు జీవితం అనుభవిస్తుండడంతో పూర్తిగా మారిపోయి కనిపించారు. తెల్లటి జుట్టుతో ఆయన లుక్ పూర్తిగా మారిపోయింది. అసలు ఆయన వల్లభనేని వంశీయేనా? అనే అనుమానం వచ్చేలా పరిస్థితి వచ్చింది. వంశీ అరెస్టయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…విజయవాడ జైలుకు వెళ్లి పరామర్శించారు. ఆ సందర్బంగా వంశీమోహన్ హీరోలా ఉంటాడని స్వయంగా జగనే కితాబిచ్చారు. దీన్ని చంద్రబాబు, లోకేశ్ జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. జగన్ అన్నట్లు నిజంగానే వల్లభనేని వంశీ…మంచి పర్సనాలిటీ ఉంటారు. గ్లామర్ కూడా తక్కువేమీ కాదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామర్ ను మెయింటెన్ చేసేశారు. తాజాగా జైలు వెళ్లాక…తన షేప్ మొత్తం మారిపోయింది.
మరోవైపు పోసాని కృష్ణమురళి పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు 17 కేసులు నమోదు కావడంతో…స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కడప, గుంటూరు, కర్నూలు, విజయవాడ…ఇలా జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు పోలీసులు. పోసాని…నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన ఆరోగ్యం సరిగా లేదని…తనను కాపాడండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. పోసాని వయసు 67 సంవత్సరాలు. స్టేషన్ చుట్టూ తిప్పు తుండటంతో బిత్తర చూపులు చూస్తున్నారు. పోసాని వాలకం చూసిన జనం…ఆయనేనా…ఈయన అని చర్చించుకుంటున్నారు.
అటు వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళి…ఇద్దరు నేతలు జుట్టుకు రంగేసుకోవడం లేదు. వంశీకి ఐదు పదులు దాటితే…పోసాని 7 పదులకు దగ్గరలో ఉన్నారు. అయితే ఇద్దరి షేప్ లు మారిపోవడానికి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ కారణమనే గుసగుసలు మొదలయ్యాయి. ఎందుకంటే పోలీసుల ట్రీట్ మెంట్ మాములుగా ఉండదు. లాఠీకి పని చెప్పారంటే…దెబ్బలు కనిపించకుండా కొట్టడంలో వారికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ నుంచి ఇద్దరు కోలుకోలేదని…అందుకనే బిత్తరచూపులు చూస్తున్నారని చర్చించుకుంటున్నారు.