KCRను ఎన్నికల్లో ఓడించిన ఏకైక వ్యక్తి ఇతనే..

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత KCR తెలంగాణ రాష్ట్రంలో ఎంత పవర్‌ఫుల్‌ లీడరో సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రాంతంపై, ఇక్కడి ప్రజల జీవితాలపై మంచి పట్టున్న కేసీఆర్‌ను ఓడించడం ఇప్పటి తరం నాయకుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు. కేసీఆర్ ను ఓడించిన వ్యక్తి ఒక్కరు ఉన్నారు. ఎవరో తెలుసా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2023 | 12:05 PMLast Updated on: Nov 23, 2023 | 12:05 PM

He Is The Only Person In Kcrs Political Life Who Defeated Kcr In Elections

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత KCR తెలంగాణ రాష్ట్రంలో ఎంత పవర్‌ఫుల్‌ లీడరో (Powerful Leader) సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రాంతంపై, ఇక్కడి ప్రజల జీవితాలపై మంచి పట్టున్న కేసీఆర్‌ను ఓడించడం ఇప్పటి తరం నాయకుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా కేసీఆర్‌ గెలుపు ఖాయం అనేంత ఇమేజ్‌ తెలంగాణ ( Telangana ) లో క్రియేట్‌ చేసుకున్నారు కేసీఆర్‌. కానీ ఓటమి స్పెల్లింగ్‌ కూడా తెలియని కేసీఆర్‌ను ఓ వ్యక్తి ఎన్నికల్లో ఓడించారు. కేసీఆర్‌ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్‌ను ఓడించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో (political life)  నిలిచిపోయారు. అయితే ఆ ఒక్క ఓటమి తప్పితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఎన్నికల్లో మళ్లీ ఓడిపోలేదు. చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్‌.. 1983లో టీడీపీలో చేరారు. అదే సంవత్సరం సిద్ధిపేట్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

Uttarakhand : మరి కొన్ని గంటల్లో శుభవార్త.. నేడు బయటికి రానున్న ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కకున్న 41 కార్మికులు..

ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అనంతుల మదన్‌ మోహన్‌ అనే వ్యక్తి కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో 887 ఓట్ల తేడాతో కేసీఆర్‌ మదన్‌ మోహన్‌ చేతిలో ఓడిపోయారు. అదే కేసీఆర్‌కు మొదటి, చివరి ఓటమి. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మళ్లీ కేసీఆర్‌కు ఓటమి అంటే తెలియదు. వరుసగా 13 సార్లు ఎన్నికలను ఎదుర్కున్నారు. ఎంపీగా 5 సార్లు, ఎమ్మెల్యేగా 8 సార్లు పోటీ చేశారు. ఎక్కడ పోటీ చేసినా, ఏ పదవికి పోటీ చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు నీరాజనం పట్టారు. తొలిసారి తనను ఓడించిన మదన్‌ మోహన్‌ను 1989లో, 1994లో.. వరుసగా రెండుసార్లు ఓడించారు కేసీఆర్‌. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన మదన్‌ మోహన్‌.. 2004లో చనిపోయారు. పేరుకు రాజకీయ ప్రత్యర్థులే అయినా.. మదన్‌ మోహన్‌ కేసీఆర్‌ కంటే చాలా సీనియర్‌. ఆయన కేసీఆర్‌కు గురువు అని చాలా మంది అంటుంటారు. ఇలా కేసీఆర్‌ను ఓడించిన ఏకైక వ్యక్తిగా మదన్‌ మోహన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసుకున్నారు.