పెళ్లాం చెప్తే వినాలి! భార్య మాట విని 25 కోట్లు గెలిచాడు

జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్‌ అవుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2024 | 12:31 PMLast Updated on: Oct 12, 2024 | 12:31 PM

He Listened To His Wife And Won 25 Crores

జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్‌ అవుతున్నాడు. అల్తాఫ్‌ బైక్ రిపేర్ లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్ల నుంచి అతను కేరళ లాటరీలు కొంటున్నాడు. రీసెంట్‌గా కూడా కేరళకు వెళ్లినప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 500 పెట్టి రెండు టికెట్లను కొన్నాడు. ఎప్పుడు లాటరీ టికెట్లు కొన్నా అల్తాఫ్‌కు నిరాశే మిగిలేది. ఈ సారి కూడా అదే జరుగుతుంది అనుకున్నాడు. రెండు టికెట్లలో ఒక టికెట్‌ తన స్నేహితుడికి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ అల్తాఫ్‌ భార్య అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ అదే టికెట్‌కు లాటరీ వస్తే ఏం చేస్తారు అంటూ భర్తను ఆపేసింది. ఆమె అదృష్టమో, అల్తాఫ్‌ స్నేహితుడి దురదృష్టమో తెలియదు కానీ.. ఆమె అనుకున్నట్టుగానే అదే టికెట్‌ లాటరీలో గెలిచింది. అల్తాఫ్‌ పాషా కొన్న టీజీ 43422 నంబర్‌ టికెట్ బంపర్ డ్రాలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో అల్తాప్ పాషా ఏకంగా 25 కోట్లు గెలుచుకున్నాడు. వయనాడ్‌ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు అల్తాఫ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అయితే మొదట అల్తాఫ్ అది ఫేక్‌ అని నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమేనని ధ్రువీకరించుకోవడంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అన్నిరకాల కటింగ్స్‌ పోను మొత్తంగా అల్తాఫ్ చేతికి 13 కోట్లు వచ్చాయి. అలా భార్య మాట విని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు అల్తాఫ్‌.