టెర్రరిస్ట్ దగ్గర గన్ లాక్కోబోయాడు.. పెహల్గామ్ హీరో
మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో, పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించి

మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో, పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. కార్ పార్కింగ్ నుండి పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానం వరకు తన గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్లిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, ఉగ్రవాదులలో ఒకరితో పోరాడటానికి ప్రయత్నం చేయగా ఈ సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో బలయ్యాడు.
అతను అక్కడికి తీసుకువచ్చిన పర్యాటకుడిని రక్షించడానికి ప్రాణాలకు తెగించి ప్రయత్నించాడు. ఉగ్రవాదులు, టూరిస్టుల మతాన్ని అడిగి, ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించమని బలవంతం చేసిన అనంతరం, 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసుకున్నారు. ఈ దాడిలో మరణించిన ఏకైక స్థానికుడు హుస్సేన్ షా. ఆ కుటుంబానికి ఏకైక జీవనాధారం షా, అని తెలుస్తోంది. అతని వృద్ధ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అనాథలుగా మారిపోయారు.
అతని తండ్రి సయ్యద్ హైదర్ షా జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “నా కొడుకు పని చేయడానికి నిన్న పహల్గామ్‌కు వెళ్లాడు, మధ్యాహ్నం 3 గంటలకు దాడి గురించి మాకు తెలిసింది. మేము అతనికి కాల్ చేసాము, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తరువాత, సాయంత్రం 4.40 గంటలకు, అతని ఫోన్ ఆన్ చేసి ఉంది, కానీ ఎవరూ స్పందించలేదు. మేము పోలీసు స్టేషన్‌కు పరుగెత్తుకొచ్చాము. ఆ తర్వాత దాడి గురించి తమకు తెలిసిందని కన్నీటి పర్యంతమయ్యారు.