ట్రయల్ కోర్ట్ లో వేసుకో: అవినాష్ కు హైకోర్ట్ ఆదేశాలు
కడప ఎంపీ... అవినాష్ రెడ్డి బెయిల్ కండిషన్ సడలించాలనే పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ముందోస్తు బెయిల్ కండిషన్ లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి,

కడప ఎంపీ… అవినాష్ రెడ్డి బెయిల్ కండిషన్ సడలించాలనే పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ముందోస్తు బెయిల్ కండిషన్ లను సడలించాలని హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. ముందోస్తు బెయిల్ మంజూరు సమయంలో దేశం విడిచి వెళ్ళొద్దనీ అవినాష్ కు షరతు విధించింది హైకోర్ట్. అనుమతి లేకుండా ఏపీ లో అడుగు పెట్టవద్దని భాస్కర్ రెడ్డి కి షరతు విధించింది.
బెయిల్ మంజూరు షరతులను ఎత్తివేయాలని కోరిన ఎంపీ అవినాష్, భాస్కర్ రెడ్డి వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు లో విచారణ జరుగుతుంది కాబట్టి బెయిల్ షరతులు సడలించొద్దని వాదనలు వినిపించింది సీబీఐ. ట్రయల్ కోర్ట్ లో పిటిషన్ వేసుకోవచ్చని అవినాష్ ను హైకోర్టు ఆదేశించింది.