ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై దేశమంతా కాయ్ రాజా కాయ్.. భారీ బెట్టింగ్..!
ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కేసీఆర్ సీఎం అవుతారా.. లేక కాంగ్రెస్ గెలుస్తుందా.. ఇదే ఇప్పుడు ఊపేస్త్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండటం.. గత ఎన్నికలకు భిన్నంగా ఈక్వేషన్స్ ఉండటంతో.. పొల్ మేటర్ మరింత ఆసక్తి రేపుతోంది.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. ఓవైపు ప్రచారం హోరెత్తుతుంటే.. బెట్టింగులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గెలిచేది ఎవరు.. సీఎం అయ్యేది ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. ఇదే విషయంపై కోట్లలో చేతులు మారుతున్నాయి. అయితే.. బెట్టింగ్ కోసం సత్తా మార్కెట్ ఫాలో అవుతూ విశ్లేషించుకుంటున్నారు. మరికొన్ని గంటల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓవైపు నేతలంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో.. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కేసీఆర్ సీఎం అవుతారా.. లేక కాంగ్రెస్ గెలుస్తుందా.. ఇదే ఇప్పుడు ఊపేస్త్తోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండటం.. గత ఎన్నికలకు భిన్నంగా ఈక్వేషన్స్ ఉండటంతో.. పొల్ మేటర్ మరింత ఆసక్తి రేపుతోంది. సందట్లో సడేమియాగా.. బెట్టింగ్స్‌కు తెరలేచింది. ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగుతున్నాయి. అయితే.. బెట్టింగ్ రాయుళ్లు సత్తా మార్కెట్‌ను ఫాలో అవుతున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనే టాపిక్‌కంటే.. ఏ పార్టీ గెలవదు.. అధికారంలోకి రాదు అనే కోణంలో బెట్టింగులు జరుగుతున్నాయి.
ORGAN DONATION: చనిపోతూ నలుగురికి అవయవదానం! బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి..
ఎందుకంటే.. ఒక పార్టీ గెలుస్తుంది అనే దానిమీద కంటే.. ఒక పార్టీ అధికారంలోకి రాదు అనే దానిమీదే ఎక్కువ డబ్బులు వస్తాయి. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్‌లో టీమిండియా గెలుస్తుందని కాకుండా.. రోహిత్ సేన గెలవదు అని పందెం కాసినవారు కోటీశ్వరులయ్యారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారు అనేకంటే.. ఎవరు గెలవరనే దానిపైనే బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందంటూ జోరుగా సాగిన బెట్టింగ్స్.. క్రమంగా బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపాయి. పోలింగ్ దగ్గర పడుతుండటం.. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం అవుతున్న క్రమంలో.. కాంగ్రెస్ మీదే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు. ఓవరాల్‌గా కాంగ్రెస్ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నా.. ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యింది. మొదట్లో బీజేపీవైపు అస్సలు మొగ్గుచూపని బెట్టింగ్ రాయుళ్లు.. ఇప్పుడు వాటిపైనా డబ్బులు పెట్టటానికి ముందుకు వస్తున్నారు.
ASSEMBLY ELECTIONS: రైతు బంధు చుట్టూ రాజకీయం.. ఇంతకీ దీన్ని ఆపిందెవరు..?
సీఎం ఎవరు అనే విషయంపైనా ఎక్కువగా పందాలు కాస్తున్నారు. ఇక.. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. ఒకటి గజ్వేల్, ఇంకొకటి కామారెడ్డి. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా.. లేక ఒక చోటే గెలుస్తారా.. ఏ సీటులో గెలుస్తారు.. ఏ సీటులో ఓడిపోతారు అనే పాయింట్‌పైనా బెట్టింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. మరోవైపు.. ఖమ్మంలో పది సీట్ల మీద కూడా ఓ రేంజ్‌లో పందేలు జరుగుతున్నాయి. వంద కోట్ల బెట్టింగ్ మార్క్ దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున అజయ్‌కుమార్.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పది వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపులా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. అంతేకాకుండా.. పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి గెలుపు, ఓటములపై కూడా పెద్ద ఎత్తునే బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే.. ఒక్క ఓటుతో గెలుస్తారనేదానిపై ఎక్కువగా బెట్టింగులు నడుస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోనే వంద కోట్ల రూపాయల బెట్టింగ్ దాటిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఏ స్థాయిలో బెట్టింగ్ జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇదే సమయంలో.. సెఫాలజిస్టులు, సర్వే ఏజెన్సీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వెల్లడిస్తున్న అంచనాలు పార్టీలో మరింత జోష్ పెంచుతున్నాయి. దీంతో.. తెలంగాణ పాలిటిక్స్‌పై మన రాష్ట్రంలోనే కాకుండా.. ఏపీలోనూ జోరుగా సాగుతోంది బెట్టింగ్. అంతే కాకుండా.. ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చేంత వరకు ఒక రేటుగా.. పార్టీల గెలుపోటములపై ఒక రకంగా.. బీజేపీ పార్టీ గెలిచే సీట్లపై మరో రకంగా.. బెట్టింగ్స్ జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుండగా.. పోలింగ్ ముగిసి, కౌటింగ్ మధ్య ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో అనే ఆసక్తి పెరుగుతోంది.