ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్‌లు.. ఆ ఇద్దరి మీదే భారీగా పందేలు..
ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి.. అధికారం ఎవరిది.. అనే విషయాలపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఎక్కువ మంది బెట్టింగ్స్ వేస్తుండడం హైలైట్. అలాగే బీఆర్ఎస్ 50 నుంచి 53 సీట్లకు పరిమితం అవుతుందని ఎక్కువ మంది బెట్టింగ్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ASSEMBLY ELECTIONS: తెలంగాణలో పోలింగ్‌కు మరికొన్ని గంటల టైమ్ ఉంది అంతే ! ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారా.. లేక కాంగ్రెస్ గెలుస్తుందా.. ఇదే టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండటం.. గత ఎన్నికలకు భిన్నంగా ఈక్వేషన్స్ ఉండటంతో.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. బెట్టింగ్‌కేదీ కాదు అనర్హం అన్నట్లు.. తెలంగాణ ఎన్నికలపై ఏపీలో భారీ బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయ్.
ASSEMBLY ELECTIONS: కారుకి కలిసొస్తున్న 20 సీట్లు.. ఓట్లు చీల్చిపెడుతున్న కమలం
ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి.. అధికారం ఎవరిది.. అనే విషయాలపై ఎక్కువగా పందేలు సాగుతున్నాయ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఎక్కువ మంది బెట్టింగ్స్ వేస్తుండడం హైలైట్. అలాగే బీఆర్ఎస్ 50 నుంచి 53 సీట్లకు పరిమితం అవుతుందని ఎక్కువ మంది బెట్టింగ్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయ్. సర్వే చేయించి మరీ.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పందేలు కాస్తున్నారు బుకీలు. కేసీఆరే సీఎం అవుతారని.. హంగ్ వస్తుందని.. కాంగ్రెస్ గెలుస్తుందంటూ కోట్లాది రూపాయల్లో బెట్టింగ్‌లు సాగుతున్నాయ్. కొన్నిచోట్ల కాంగ్రెస్‌కు, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్‌కు అనుకూలంగా బెట్టింగ్‌లు సాగుతున్నాయ్. కొన్ని చోట్ల రూపాయికి రూపాయి.. ఇంకొన్ని చోట్ల రూపాయికి రెండు రూపాయల మేర పందేలు జరుగుతున్నాయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు.. ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, మైనంపల్లి, అతని కుమారుడి మీద.. ఏపీ బెట్టింగ్ బ్యాచ్ ప్రత్యేకంగా పందేలు కాస్తోంది.
అటు కూకట్‌పల్లి స్థానం మీద కూడా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. జిల్లాలవారీగా విశ్లేషిస్తూ.. పందెం రాయుళ్లు పందేలు కాస్తున్నారు. బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో.. మెజార్టీ, గెలుపోటములపై కూడా పందేలు జరుగుతున్నాయ్. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో.. ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి గెలుపుపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. ఇదంతా ఒకెత్తు అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనే దానిపై బెట్టింగ్‌లు సాగుతున్నాయ్.