కేటిఆర్ కు హైకోర్ట్ షాక్..!

గురువారం జరగబోయే ఏసీబీ విచారణకు కేటిఆర్ న్యాయవాదికి అనుమతి లేదని.. కేటిఆర్ మాత్రమె విచారణ గదిలో ఉండాలని తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 07:28 PMLast Updated on: Jan 08, 2025 | 7:28 PM

High Court Shock For Ktr

గురువారం జరగబోయే ఏసీబీ విచారణకు కేటిఆర్ న్యాయవాదికి అనుమతి లేదని.. కేటిఆర్ మాత్రమె విచారణ గదిలో ఉండాలని తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది. లైబ్రరీ లో న్యాయవాది కూర్చోడానికి సౌకర్యం ఉందని.. లైబ్రరీ గ్లాస్ నుండి కేటీఆర్ విచారణ కనిపిస్తుందని హైకోర్ట్ ఏసీబీ తెలిపింది. కేటీఆర్ తో పాటు న్యాయవాది వెళుతారని.. కేటీఆర్ తో పాటు రాం చందర్ రావు అటెండ్ అవుతారని కోర్ట్ ముందు వాదనలు వినిపించగా.. అందుకు కోర్ట్ అంగీకరించలేదు. ఆడియో విడియో రికార్డింగ్ కావాలని కేటీఆర్ న్యాయవాది కోర్ట్ ను కోరగా కోర్ట్ నిరాకరించింది.

ఆడియో విడియో రికార్డింగ్ కావాలా, న్యాయవాది అనుమతి కావాలా అని అంటూ ప్రశ్నించిన హై కోర్టు.. రెండు వెసులుబాటులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ముందు విచారణకు హాజరు కావాలని ఏవైనా సమస్యలు ఉంటే కోర్ట్ కు రావొచ్చని కేటిఆర్ తరుపు న్యాయవాదికి హైకోర్ట్ సూచించింది. లైబ్రరీ రూమ్ తో పాటు, సీసీటీవీలు ఉండే రూమ్ నుండి న్యాయవాది కేటీఆర్ ను చూడవచ్చని ప్రభుత్వ న్యాయవాది తెలపగా అందుకు కోర్ట్ అంగీకరించింది. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచందర్ ఏసీబీ ఆఫీస్ లోకి వెళ్ళాలని ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్న లైబ్రరీ లో కూర్చొని… లైబ్రరీ విండో నుంచి ఇన్వెస్టిగేషన్ ను అడ్వకేట్ అబ్జర్వ్ చేయొచ్చని హైకోర్ట్ సూచించింది.