కల్వరి టెంపుల్ సతీష్ కు హైకోర్ట్ షాక్
కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్ కు ఇటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా...
కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్ కు ఇటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా… దానిపై హైకోర్ట్ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారన్న పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
సి ఆర్ డి ఏ మరియు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించటం చట్టవిరుద్ధమని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారన్న పిటీషనర్ వాదనతో కోర్ట్ ఏకీభవించింది. తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ పిటిషనర్ కోరగా… పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం… తక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యాలకి నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.