సాయి రెడ్డి నోరు జాగ్రత్త, రోజులు లెక్కపెట్టుకో : అనిత

విజయవాడ సబ్ జైలును హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2024 | 02:59 PMLast Updated on: Dec 09, 2024 | 2:59 PM

Home Minister Anita Conducted A Surprise Inspection Of The Vijayawada Sub Jail

విజయవాడ సబ్ జైలును హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందన్నారు. జైలులో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని… ఇటీవల జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులు తనిఖీ చేయడం జరిగిందని వివరించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. వైసిపి నేతలు గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకున్న జగన్ అండ్ కో అంటూ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయిరెడ్డిది కాదన్నారు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసిపి నేతలు మాట్లాడుతున్నారన్నారు.

వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారులను బెదిరించి వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పోలీసులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని సూచించారు. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.