స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి ఎలా వస్తుంది…? సముద్రంలో ల్యాండింగ్ ఎలా చేస్తారు…?

దాదాపు 9 నెలల నుంచి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉండిపోయిన వ్యోమగాములు విల్ బుచ్ మోర్, సునీత విలియమ్స్ తిరిగి భూమి మీదకు వస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 02:44 PMLast Updated on: Mar 18, 2025 | 2:44 PM

How Does A Spacecraft Land On Earth How Does It Land In The Ocean

దాదాపు 9 నెలల నుంచి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉండిపోయిన వ్యోమగాములు విల్ బుచ్ మోర్, సునీత విలియమ్స్ తిరిగి భూమి మీదకు వస్తున్నారు. వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది.. అంతరిక్షం నుంచి వారిని సురక్షితంగా ఎలా తీసుకొస్తారు…? వ్యోమనౌకలు అంత ఎత్తు నుంచి కిందకు వచ్చే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటాయి..? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నాయి. అసలు ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం.

2003 ఫిబ్రవరి 1న భారత సంతతికి వ్యోమగామి కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షంలో 17 రోజులు గడిపి ఫిబ్రవరి 1న.. కొలంబియా అంతరిక్షనౌకలో భూమి మీదకు వస్తున్నారు. కాని ఆ సమయంలో.. అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగడానికి కొన్ని క్షణాల మందే.. కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయింది. ఇక అప్పటి నుంచి నాసా… వ్యోమగాములను తీసుకొచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

అంతరిక్ష నౌకలు భూమి మీదకు వచ్చే సమయంలో చాలా వేగంతో ప్రయాణిస్తాయి. దాదాపుగా 24,000 మైళ్ల వేగంతో అవి భూమి మీదకు వస్తాయి. దాదాపు 3000 డిగ్రీల ఫారన్ హీట్‌ అంటే 1650 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వాటి చుట్టూ ఉంటుంది. సాధారణంగా అంత వేడి అంటే ఏ వస్తువు అయినా సరే కరిగిపోతుంది. కాని అంతరిక్ష నౌకలను ఆ వేడి తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు. మరి అంత వేగంతో దిగే నౌకల వేగాన్ని ఎలా తగ్గిస్తారో ఒకసారి చూద్దాం.

ఈ ప్రాసెస్ ను ‘అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ’ గా పిలుస్తారు. అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన స్టేజెస్ లో ఇది ఒకటిగా చెప్తారు. వ్యోమ నౌక చుట్టూ బలమైన ఉష్ణ కవచాలు, పారాచూట్ వ్యవస్థలతో పాటుగా పక్కాగా మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయట. స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చే వీడియో మీరు చూస్తే.. ఒక అగ్ని గోళం భూమి మీదకు పడుతున్నట్టు ఉంటుంది. భూ వాతావరణంలో వేడి కారణంగా ఇలా మారుతుందని నాసా చెప్తుంది. ఇక్కడ ప్రధాన సమస్య… ఉష్ణోగ్రతలే.

ఈ వేడిని తట్టుకునే విధంగా ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను తయారు చేస్తున్నారు. ఏఎంఈఎస్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ నాసాకు ఈ కవచాలను అందిస్తోంది. వివిధ రకాల మెటీరియల్స్, డిజైన్లను తయారు చేసింది. నాసా అపోలో ప్రోగ్రామ్ (1961-1972) కోసం ప్రత్యేకంగా అవ్‌ కోట్ అనే ఉష్ణకవచాన్ని తయారు చేసిందట. ఈ ప్రాసెస్ లో కీలకమైన హీట్ షీల్డ్ ‘ఫినోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్’ (పీఐసీఏ) ను 1990లలో అభివృద్ధి చేయగా నేటికి అదే వాడుతున్నారు. చాలా పటిష్టంగా ఉంటుంది ఈ డిజైన్.

ఇక ఎలాన్ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్ సహకారంతో పీఐసీఏను ఇంకా డెవెలప్ చేసి.. పీఐసీఏ-ఎక్స్ అనే కొత్త మోడల్ ను తీసుకొచ్చి ప్రస్తుతం అదే వాడుతున్నారు. ఈ హీట్ షీల్డ్‌ లను కృత్తిమంగా సృష్టించి పరిక్షలు చేస్తారు. భూ వాతావరణంలో ఎదురయ్యే ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా దాన్ని తయారు చేస్తారు.

ఇక ఇక్కడ కీలకం… వేగాన్ని కంట్రోల్ చేయడం… భూ వాతావరణంలోకి నౌకలు వచ్చిన తర్వాత… అంతరిక్షనౌక వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. గాలి నిరోధకత కారణంగా ఈ విధంగా జరుగుతుందని నాసా వెల్లడించింది. గాలిలో ప్రయాణించే ఏ వస్తువును అయినా సరే.. దాని వేగాన్ని గాలి కంట్రోల్ చేస్తుంది.. దీనినే గాలి నిరోధకత అని పిలుస్తారు. స్పేస్‌క్రాఫ్ట్ భూమి నుంచి 10 కి.మీ- 50 కి.మీ ఎత్తులో ప్రయాణించే సమయంలో దాని స్పీడ్… చాలా భారీగా తగ్గుతుంది.

అంతరిక్షనౌకల వేగం గంటకు 39,000 కి.మీ నుంచి దాదాపు 800 కి.మీ వేగానికి కేవలం నిమిషాల వ్యవధిలోనే పడుతుంది. గంటకు 800 కి.మీ వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్‌కు అనుకూలం కాదు కాబట్టి… భూమిని సమీపిస్తున్న కొద్ది వేగాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ దశల్లో పారాచూట్లను ఏర్పాటు చేసి… తగ్గిస్తారు. ఉదాహరణకు చూస్తే… ఒక స్పేస్‌ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చే సమయంలో.. 10.5 కి.మీ -9.5 కి.మీ ఎత్తులో ఉన్నప్పుడు మొదటి దశలో ఉన్న పారాచూట్లు ఓపెన్ అవుతాయి. అప్పుడు దాని వేగం గంటకు 828కి.మీ నుంచి 360 కి.మీకు పడిపోతుంది.

ఆ తర్వాత ఇది 8 కి.మీ -7.5 కి.మీ ఎత్తు వరకు రాగానే మరో దశలో ఉన్న పారాచూట్లు ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ స్పేస్‌క్రాఫ్ట్ వేగం గంటకు 25 కి.మీకు పడిపోతుంది. ఇక ఇక్కడి నుంచి చిన్న చిన్న రాకెట్ లను ఉపయోగిస్తారు. చిన్న రాకెట్లను వ్యతిరేక దిశలో మందిస్తారు. అలా అంతరిక్షనౌక వేగాన్ని గంటకు 2 నుంచి 1.5 మీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపైకి తీసుకొస్తారు.

ఇక ల్యాండింగ్ కు సముద్రం సేఫ్ ప్లేస్ గా భావిస్తారు. కచ్చితమైన ప్రదేశంలో దించేందుకు వాతావరణం కూడా సహకరించాలి. అలాగే సముద్ర స్వభావం కూడా ఇక్కడ చాలా కీలకం. అంతరిక్షనౌక గతి ఎలా ఉందో కూడా పక్కాగా అంచనా వేయాల్సి ఉంటుంది. ల్యాండింగ్ ప్లేస్ ను ఫైనల్ చేయడానికి నాసా… స్పేస్‌ఎక్స్ లు.. జీపీఎస్, ఐఎన్‌ఎస్, ప్రెడెక్టివ్ మోడల్స్ వంటి టెక్నాలజీని వాడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోతే… ప్లేస్ వెంటనే మార్చేస్తారు. సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే.. అక్కడ రిసీవింగ్ టీం రెడీగా ఉంటుంది. వాళ్ళు.. రిసీవ్ చేసుకుని.. ప్రత్యేకంగా సిద్దం చేసిన రూమ్ కు తీసుకుని వెళ్లి… భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడిన తర్వాత.. వారిని బయటకు తీసుకుని వస్తారు.