పవన్ కళ్యాణ్ కొడుకు ఎలా ఉన్నాడు.. మార్క్ శంకర్ హెల్త్ కండిషన్ పై స్పెషల్ అప్డేట్..!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. వాళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్ళాడు. అరకు ట్రైబల్ ఏరియాలో ప్రజల మధ్య ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు సింగపూర్ నుంచి కొడుకు ఫైర్ యాక్సిడెంట్ గురించి ఫోన్ వచ్చింది. ముందు అది చిన్నది అని పవన్ అనుకున్నాడు కానీ అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఒరిజినల్ సిచువేషన్ ఆయనకు కూడా అర్థమైంది. ఈ ప్రమాదంలో పదేళ్ల బాలుడు కూడా చనిపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు విషయానికి వస్తే గాయాల వరకు చిన్నవి అయినా కూడా.. ఊపిరితిత్తుల్లోకి బాగా పొగ వెళ్ళిపోవడంతో దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని వైద్యులు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు మార్క్ శంకర్. ఈ ప్రమాద సమయంలో అక్కడి భవన నిర్మాణ కార్మికుల తమ ప్రాణాలకు తెగించి స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆ కార్మికులకు తమ కృతజ్ఞతలు తెలిపాడు. ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపుకోత లేకుండా వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి ఆ పిల్లల ప్రాణాలను కాపాడారు అని గుర్తు చేశాడు. ఈ ఘటనలో చనిపోయిన ఆ కుర్రాడి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించాడు పవన్ కళ్యాణ్. ఇక తన కుమారుడి ఆరోగ్యం విషయానికి వస్తే మూడు రోజులపాటు ఈ వైద్యం అందించాలని చెప్పాడు పవన్. ఊపిరితిత్తుల్లోకి పొగ ఎక్కువగా చేరడంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని వైద్యులు చెప్పినట్టు తెలిపాడు.
పెద్ద కొడుకు అకీరానందన్ పుట్టినరోజు నాడే చిన్న కొడుకుకి ఇలా ప్రమాదం జరగడం బాధ కలిగించింది అన్నారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ కొడుకుకు ప్రమాదం జరిగింది అనే విషయం తెలియగానే దేశంలోనే ప్రముఖ రాజకీయ నేతలు మొత్తం ఆయనను ఫోన్లో పరామర్శించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందరో తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినందుకు.. తను బాగుండాలని కోరుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లి తమ్ముడు కొడుకుని చూశారు. తను క్రమంగా కోరుకుంటున్నాడని.. అభిమానులు కలత చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. కాకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. త్వరలోనే అవి తిరుపతయే అంటున్నాడు మెగాస్టార్. ఏదేమైనా మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్తో పాటు ఆయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులు సింగపూర్ లోనే ఉండి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ రానున్నాడు పవన్ కళ్యాణ్. అప్పటివరకు ఆయన రాజకీయ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి.