KCR in AP: ఏపీని దెబ్బతీసి.. ఓట్లెలా అడుగుతారు కేసీఆర్?
ఏపీ దుస్థితికి కారణం అయిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు అంటూ.. చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సవాళ్లు ఎదురుకాకపోవచ్చు.. ఎన్నికల టైమ్‌కు స్టార్ట్ అవుతాయ్ నిలదీతలు !
ప్రత్యర్థి ఆలోచనలకు నాలుగు అడుగుల ముందే ఉంటారు కేసీఆర్ ! రాజకీయాలను దాదాపు చదివేసిన నాయకుడు.. అందుకే ఆయను ఢీకొట్టడం అంత ఈజీ కాదు అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపించే చర్చ! అదంతా అప్పుడు అని.. ఇప్పుడు సీన్ మారిందని.. కేసీఆర్ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయనే వర్గం కూడా ఉంది.
ఇదంతా ఎలా ఉన్నా.. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీగా ఏ రాష్ట్రంలో అయినా అడుగు పెట్టే హక్కు ఉంటుంది.. రాజ్యాంగం కల్పించింది కూడా ! ఇది కాదు మ్యాటర్.. ఏపీ ప్రస్తుత దుస్థితికి కారణం అయిన కేసీఆర్.. ఓట్లు ఎలా అడుగుతారు అన్నదే మ్యాటర్. లీడర్లే కాదు.. ఏపీవాళ్లంతా శత్రువులే అని ఉద్యమం సమయంలో కేసీఆర్ అన్న మాటలు.. ఇప్పటికీ రీసౌండ్ ఇస్తూనే ఉంటాయ్. వాటిని మర్చిపోయి.. బీఆర్ఎస్‌ను ఏపీ వాళ్లు దగ్గరకు చేర్చుకుంటారా అంటే.. అంత సీన్ లేదు కచ్చితంగా !
గతం వదిలేస్తే.. వర్తమానంలో ఎన్నో విషయాలు ఇప్పటికీ ఏపీ జనాలను వెంటాడుతున్నాయ్. హైదరాబాద్‌ను కోల్పోయామనే బాధ.. ఇప్పటికీ ఏపీ జనాల మనసు తొలిచేస్తూనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను లాక్కొని ఏపీని అనాథను చేశారన్నది చాలామంది ఫీలింగ్. హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ హాయిగా ఉంది.. ఏపీ అప్పుల పాలు అయిందనే భావన ఉంది జనాల్లో ! దీనంతటికి కారణం తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆరే అని ఇప్పటికీ చాలామంది అనుకుంటారు. కృష్ణ, గోదావరి నీళ్ల పంచాయితీ విషయంలోనూ కేసీఆర్ తీరుపై ఏపీ జనాలు గుర్రుగా ఉన్నారు. నీళ్లు, ఆశల మీద దెబ్బల కొట్టి.. ఇప్పుడు ఏపీ మీద ఎక్కడలేని ప్రేమ చూపించడం ఏంటి అనే చర్చ మొదలైంది.
విడదీసి ఏపీ దుస్థితికి కారణం అని భావించి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన ఏపీ జనాలు.. విడదీయడానికి కారణం అయిన కేసీఆర్ పార్టీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ దుస్థితికి కారణం అయిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతారు అంటూ.. చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సవాళ్లు ఎదురుకాకపోవచ్చు.. ఎన్నికల టైమ్‌కు స్టార్ట్ అవుతాయ్ నిలదీతలు !