శంతనుకు ఎన్ని కోట్లు ఇచ్చాడంటే? వీలునామా లో ఏముంది?
రతన్ టాటా వీలునామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చారిటీకే దాదాపు 4వేల కోట్లు కేటాయించిన ఆయన...కుటుంబసభ్యులు, స్నేహితులకు కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాశారు.

రతన్ టాటా వీలునామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చారిటీకే దాదాపు 4వేల కోట్లు కేటాయించిన ఆయన…కుటుంబసభ్యులు, స్నేహితులకు కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాశారు. అయితే ఆయనకు కేర్ టేకర్ గా వ్యవహరించిన శంతను నాయుడుకు ఎన్ని కోట్లు ఇచ్చారు ? రతన్ టాటా వీలునామాలో ఏముంది ? అన్నది ఆసక్తి రేపుతోంది.
రతన్ టాటా జీవిత చరమాంకంలో శంతను నాయుడు…అత్యంత సన్నిహితంగా మెలిగాడు. చివరి దశలో కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడు. టాటా ట్రస్ట్‌లో అతి పిన్నవయస్కుడైనా జనరల్ మేనేజర్‌గానూ, టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గానూ శంతను వ్యవహరించిన తీరు ఎంతో మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అందుకే ఆ దోస్తీ గుర్తుండిపోయేలా… ప్రేమతో తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశారు. రతన్ టాటా చనిపోయిన సమయంలో…ఓ పాత ఫొటోను షేర్ చేశాడు శంతను నాయుడు . ఫోటోకు ‘గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్ అంటూ క్యాప్షన్ ఇచ్చి…గుండెలు పిండేసేలా ఎమోషనల్ నోట్ జత చేశాడు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవ్వడం వల్ల కలుగుతోన్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిదంటూ ట్వీట్ చేశాడు.
చివరిదశలో శంతను నాయుడుతో రతన్ టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపర్చింది. వీధి శునకాలపై ఉన్న ప్రేమే వీరిద్దరిని కలిపింది. 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు శంతను. తొలుత బిజినెస్ పరంగా మాట్లాడే ఈ ఇద్దరికీ ఆ తర్వాతి కాలంలో మంచి దోస్తీ కుదిరింది. పెద్ద వయస్కులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత రతన్‌జీతో స్నేహం వల్లే…తెలిసిందంటూ శంతను ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే గుడ్‌ఫెలోస్ అనే ఓ అంకుర సంస్థ. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో…శంతనునాయుడు దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా ఆ సంస్థ లాంచింగ్ కార్యక్రమానికి హాజరై అక్కడి వారితో సమయం గడిపారు.
శంతను నాయుడు ప్రస్తుతం టాటా ట్రస్ట్ లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. టాటా గ్రూప్ లో అత్యంత పిన్న వయస్కుడైన మేనేజర్ గుర్తింపు సంపాదించుకున్నాడు. సావిత్రిభాయి పూలే పుణె యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. కార్నెల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. గ్రాడ్యూయేషన్ ఫంక్షన్ కు రతన్ టాటా కూడా హాజరయ్యాడు.