ఏ పార్టీకి ఎన్ని కోట్లంటే…? 4340 కోట్లతో బీజేపీ టాప్
కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం కామనే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి.

కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం కామనే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలకే అందులో మేజర్ వాటా దక్కుతోంది. 75 శాతం నిధులు కాషాయ పార్టీ ఖాతాలోకే చేరాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో …ఆదాయ ఆర్జనలో కమలం పార్టీ టాప్ లేపింది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు 5,820.91 కోట్ల ఆదాయం వస్తే…అందులో 74.567% కమలం పార్టీ ఖాతాలోకే వెళ్లినట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. కేంద్రంలోని అధికార బీజేపీ…ఎప్పట్లాగే ఏకంగా 4,340.47 కోట్ల ఆదాయంతో నంబర్ వన్ గా నిలిచింది. భారత్‌లోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 74.57 శాతానికి సమానమైన ఆదాయం ఒక్క బీజేపీకే వచ్చింది. మొత్తం జాతీయపార్టీల ఆదాయంలో…బీజేపీ, కాంగ్రెస్‌లకే 96% మేర దక్కింది. కాషాయదళం తమ ఆదాయంలో 50.96 శాతం అంటే 2,211.69 కోట్లు నిధులనే ఖర్చు చేసింది. 2,211.69 కోట్లలో 79.31% ఎన్నికలు, ప్రచారం కోసం, 15.81% పరిపాలన అవసరాలకోసం, 3.32% సిబ్బంది జీతభత్యాలకు వెళ్లింది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ రావడంలో వింతేమీ లేదు. అయితే ఈ ఏడాది డొనేషన్లు భారీగా పెరగడం మాత్రం విశేషమే. ఈ ఏడాది బీజేపీకి ఏకంగా రూ.4,340.47 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోల్చితే కమలానికి డొనేషన్ల కాసులు ఊహించని విధంగా వచ్చిపడ్డాయి.
ఇక సెకండ్ ప్లేస్ లో జాతీయపార్టీ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి 1,225.12 కోట్ల ఆదాయం వస్తే…ఇందులో 83.69 శాతం అంటే 1,025.25 కోట్లు ఖర్చు పెట్టింది. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్…దేశంలో అత్యధిక విరాళాలు పొందిన రెండో పార్టీగా నిలిచింది. ఆ పార్టీకి 580కోట్ల డొనేషన్లు అందాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ…స్థానాన్ని భర్తీ చేసింది. సీపీఎంకు 167 కోట్లు, బీఎస్పీకి 64 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి .22.68 కోట్లు వచ్చాయి. 2022-23తో పోలిస్తే 2023-24లో బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82%, సీపీఎం ఆదాయం 18.34% పెరిగింది.
కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 619.67 కోట్లను పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చుల కోసం 340.70 కోట్లను వెచ్చించింది. సీపీఎం తమ పార్టీపరమైన పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చుల కోసం రూ.56.29 కోట్లను వెచ్చించింది. ఉద్యోగుల కోసం రూ.47.57 కోట్లను ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా…ఏడీఆర్ సంస్థ ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఇండియాను కోరింది. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన 4,507.56 కోట్ల విరాళాలను నగదుగా మార్చుకున్నాయి. ఇందులో అత్యధికంగా 2,524.13 కోట్లను జాతీయ పార్టీలే విత్‌డ్రా చేసుకున్నాయి.
2023-24లో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల ఆదాయంలో సింహభాగం ఎన్నికల బాండ్ల రూపంలోనే వచ్చింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి అత్యధికంగా 1,685.63 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.828.36 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.10.15 కోట్ల విరాళాలు అందాయి. ఈ మూడు జాతీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.2,524.13 కోట్ల డొనేషన్ల రూపంలో వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మొత్తం ఆదాయంలో 43.36 శాతం ఎన్నికల బాండ్ల రూపంలోనే సమకూరింది. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతి అమలును…నిలిపేస్తూ 2024 సంవత్సరం మే నెలలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.