ఔరంగజేబుకు ఎంత మంది భార్యలు..? అతను హిందు దేవాలయాలకు స్థలాలు ఇచ్చాడా..?
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అవుతోంది. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అవుతోంది. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ సినిమాలో శంభాజీ వర్సెస్ ఔరంగజేబ్ గా చూపించాడు. దీనితో ఔరంగజేబ్ ఎంత క్రూరుడో జనాలకు అర్ధమైంది. అతనికి మానసికంగా కూడా సమస్యలు ఉండేవని.. పదే పదే రాజధానులను కూడా మారుస్తూ ఉండేవాడు అని చరిత్ర పాఠాల్లో ఉండేది. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో మొఘల్ రాజుల గురించి ఎక్కువగా ఉండేది.
వారిలో అత్యంత క్రూరుడిగా ఔరంగజేబు గురించి చెప్పారు చరిత్ర కారులు. అసలు అతను పరమత సహనం లేనివాడని, హిందువులను నానా ఇబ్బందులకు గురిచేశాడని అలాగే జిజియా పన్ను విధించాడని కూడా చరిత్ర పాఠాల్లో ఉండేది. ఎన్నో హిందు ఆలయాలను కూల్చేశాడని, రాజ్యకాంక్షతో సొంత తండ్రిని కూడా చంపాడని కూడా పాఠాల్లో ఉండేది. కాని అతడి వ్యక్తిగత జీవితం గురించి మన పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావించలేదు. అందుకే అతడి వ్యక్తిగత జీవితం గురించి జనాలకు ఇప్పుడు ఆసక్తి పెరిగిపోయింది. ఇక అతనికి చాలా మంది భార్యలు ఉండేవారు అనేవి వింటూ ఉండే వాళ్ళం.
ఇందులో భాగంగానే ఆయనకు ఎంత మంది భార్యలు ఉన్నారో.. వాళ్ళను అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో చూద్దాం. ఔరంగజేబు 1618 సంవత్సరంలో దాహోద్ లో జన్మించాడు. ప్రస్తుతం ఇది గుజరాత్ లో ఉంది. షాజహాన్, ముంతాజ్ కు అతను మూడో కుమారుడు. ఔరంగజేబు మాత్రం తానే రాజు అయ్యేందు తన సోదరులందరినీ ఓడించి.. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి కావడం ఒక సంచలనం. దేశ చరిత్రలోనే అత్యంత క్రూర రాజుగా అతని గురించి చరిత్ర చెప్తుంది. ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో మరణించాడు. ఆయన మతదేహాన్ని అక్కడి నుంచి ఖుల్తాబాద్ కు తరలించారు.
ఔరంగజేబుకు ముగ్గురు భార్యలు ఉండేవారు అని చరిత్ర చెప్తోంది. మొదటి భార్య దిల్రాస్ బానో బేగంను.. అతను 1637లో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య నవాబ్ భాయి, ఒక హిందూ రాజు కుమార్తె. రాజకీయ సౌలభ్యం కోసం1638లో ఆమెను వివాహం చేసుకున్నాడట. ఇక మూడో భార్య విషయానికి వస్తే.. జార్జియా లేదా సర్కస్. కొందరు ఈమెను ఉంపుడుగత్తె అని చెప్తారు. ఔరంగజేబుకు ఐదుగురు కొడుకులతో పాటుగా ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అతను తన పిల్లలు అందరిని తన వద్దనే ఉంచుకున్నాడు.
అయితే అతనికి దైవ భక్తి కూడా ఎక్కువేనని చరిత్ర చెప్తోంది. తన మతాచారాలను తప్పకుండా పాటించే.. ఔరంగజేబు.. తన స్వంత ఖర్చులను… తాను టోపిలు కుట్టి సంపాదించిన డబ్బులతోనే పెట్టేవాడట. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లింలు కానివారిపై జిజియా పన్ను కూడా విధించినట్టు చరిత్ర చెప్తోంది. హిందూ దేవాలయాలకు నిధులు కూడా ఇచ్చాడని చరిత్ర పుస్తకాల్లో ఉండటం గమనార్హం. అలహాబాద్ లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్ని ఇవ్వడంతో పాటుగా… ఉజ్జయిని, చిత్రకూట బాలాజీ, గౌహతీ ఉమానంద్ ఆలయాలకు నిధులు కూడా ఇచ్చినట్టు పుస్తకాల్లో పేర్కొన్నారు. గోల్కొండ లోని జామా మసీదును పడగొట్టి దాని కింద ఉన్న నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు అని చెప్తారు.